ఈ నెల పత్రిక పరిచయం “అరుణతార”

సాధారణం

ఒక సాహిత్య పత్రికగా 275 సంచికలు వెలువడడం మాటలు కాదు. అందులోనూ విప్లవ స్ఫూర్తి నిబద్దతలతో వెలువడుతున్న అరుదైన సాహితీ మాస పత్రిక “అరుణతార”. ఈ మాసపు పత్రికగా అలోచనను పంచే, పెంచే “అరుణతార” పత్రికను పరిచయం చేసుకుందాం. విప్లవ రచయితల సంఘం (విరసం) అధికార పత్రిక “అరుణతార” తాజాగా వెలువరించిన 275వ సంచిక మార్చి – మే 2009 తేదీతో ప్రత్యేక సంచికగా వెలువడింది. మహా రచయిత పతంజలి మీక కొన్ని ప్రత్యేక వ్యాసాలతోపాటు ‘మహిళాతేజం’ ప్రత్యేక శీర్షికతో మరికొన్ని పరిచయ, సంస్మరణ వ్యాసాలున్నాయి. అసలు పుస్తక సమీక్ష అంటే అర్థం మారిపోయిన సందర్భంలో ప్రొఫెసర్ ఆర్. ఎస్. రావు ప్రత్యేక ఆర్థిక మండలాల మీద రాసిన వ్యాసం సమగ్ర పుస్తక సమీక్ష ఎలా వుండాలో చెప్పేదిలా వుంది.

ఇవికాక ప్రతి సంచికలోనూ కథలు, కవిత్వం, పుస్తక పరిచయాలు, వ్యాసాలు తప్పకుండా వుంటాయి. అదికాక ఇటీవల పాణి ‘గుమ్మెటమోత’ సీరియల్ ప్రారంభించారు. సీరియస్ గా సాహిత్యాన్ని చదివే ప్రతి పాఠకుడు తప్పక తెప్పించుకోవాల్సిన పత్రిక “అరుణతార”. ఎందుకు తెప్పించుకోవాలంటే ఈ పత్రిక విడిగా మార్కెట్లో, పత్రికల స్టాల్లో దొరకదు కనక. కేవలం 100 రూపాయల సంవత్సర చందా కట్టి ప్రతి సంచికనూ ఇంటికే తెప్పించుకునే సదుపాయముంది కనుక, అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

పైగా బ్లాగులు చదివే మిత్రులందరికీ విన్నవించుకునేదేమంటే, ప్రత్యామ్నాయ పత్రికలకు చందా కట్టడం వాటికి ప్రాణం పోయడమే. మెయిన్ స్ట్రీమ్ పత్రికలకు రకరకాల రూపాలలో ఆర్థిక వనరులు సమకూరుతాయి. విరాళాలు, ప్రకటనలు, సంవత్సర చందాలు, ఇంకా పాట్రన్ లు వాటికి వుంటారు. కానీ ప్రత్యామ్నాయ పత్రికలు బతికేది కేవలం పాఠకులు చందా కట్టడం వలన మాత్రమే.  మరింత మంది మిత్రులచేత చందా కట్టించడం వల్ల మాత్రమే.

“అరుణతార”కు చందా పంపవలసిన చిరునామా: ఎస్. రవికుమార్, 5-1307, దొరసానిపల్లె రోడ్, ప్రొద్దుటూరు, కడప జిల్లా – 516360. మొబైల్ నెంబరు: 9866021257

ప్రకటనలు

3 responses »

  1. బ్లాగులు చదివే మిత్రులందరికీ విన్నవించుకునేదేమంటే, ప్రత్యామ్నాయ పత్రికలకు చందా కట్టడం వాటికి ప్రాణం పోయడమే. మెయిన్ స్ట్రీమ్ పత్రికలకు రకరకాల రూపాలలో ఆర్థిక వనరులు సమకూరుతాయి. విరాళాలు, ప్రకటనలు, సంవత్సర చందాలు, ఇంకా పాట్రన్ లు వాటికి వుంటారు. కానీ ప్రత్యామ్నాయ పత్రికలు బతికేది కేవలం పాఠకులు చందా కట్టడం వలన మాత్రమే కాక, మరింత మంది మిత్రులచేత చందా కట్టించడం వల్ల మాత్రమే.

    మీ రాతలు… అక్షర సత్యాలు. నేనుకూడా మూడునెలల క్రితమే ప్రజాసాహితీ, విద్యార్థి చెకుముకి, వీక్షణం, అరుణతార లకు చందా కట్టాను. కాని ప్రజాసాహితి, విద్యార్థి చెకుముకి వస్తున్నాయి. వీక్షణం, అరుణతార ఇంకా రాలేదు. ఎదురు చూస్తున్నా.
    ప్రత్యామ్నాయ పత్రికలకు సంబంధించి మీరు చెప్పింది అందరికీ ఆచరణీయమే.. నెలలో ఒక సినిమాకు పోవడం ఆపుకుంటే చాలు సంవత్సరం పత్రికలు ఇలాంటివి సులభంగా ఇంటికే వస్తాయి. మీ పిలుపును అందరూ వింటారని ఆశిస్తూ

  2. పింగుబ్యాకు: అరుణతార పత్రిక పరిచయం « పౌర స్వేచ్చ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s