ఈ నెల పత్రిక పరిచయం “సెమినార్”తో…

సాధారణం

సమాజ సాహిత్యాలు వేర్వేరుగా వునికిలో వుండవు. అవి ఒకే నాణేనికి బొమ్మా బొరుసులు. నిజానికి సమాజాన్ని సునిశితంగా పరిశీలించేవారు సాహిత్యాన్ని లోతుగా అర్థం చేసుకోగలుగుతారు. సాహిత్యాన్ని తదేక దీక్షతో అధ్యయనం చేసేవారు సామాజిక పరిణామాలను ఎంతో నేర్పుగా విశ్లేషించగలుగుతారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాక “ఆంధ్రజ్యోతి”లో ఎన్. వేణుగోపాల్ ‘వైఎస్ చివరి పుట్టినరోజు’  సంస్మరణ వ్యాసం రాశారు. దానిని విరసిస్తూ రంగనాయకమ్మగారు ‘అమ్మకానికో విప్లవ రచయిత’ వ్యాసం ప్రదురించారు. (వేణుగోపాల్ “అమ్మకానికి ఆంధ్రప్రదేశ్” శీర్షికతో ఒక వ్యాససంపుటిని ప్రచురించారు. దానిపై వెటకారంగా ఈ టైటిల్ వ్యాసానికి పెట్టారు రంగనాయకమ్మగారు!) ఆ వెంటనే విరసం నుంచి వేణుగోపాల్ ను బహిస్కరిస్తున్నట్టు పాణి అదే పత్రికలో ప్రకటన విడుదల చేశారు. అంతవరకూ జరిగిన విషయాన్ని ఒక్క కుదుపు కుదుపుతూ ‘సహచరుడు’ బ్లాగులో ఈ విషయంపై రేగిన విమర్శల దుమారం చూస్తే ఖిన్నులం కాక మానం.

ఎప్పుడో పాశ్చాత్య కవి ఎఫ్. స్కాట్ ఫిట్జెరాల్డ్ చెప్పినమాట మరోమారు మొన్నటి వారం తెహెల్కా వారపత్రికలో చదివినప్పుడు ఈ రగడ అంతా మళ్లీ గుర్తొచ్చింది. “The test of a first rate intelligence is the ability to hold two opposed ideas in the mind at the same time, and still retain the ability to function”. ఒక విషయం గురించి ఒకే పత్రికలో భిన్న వ్యాఖ్యానాలుంటే మన తెలుగు మేధావులు జీర్ణించుకోలేరుగాని, అలాంటి పత్రిక ఒకటి గత ఏభై ఏళ్లుగా వస్తోందంటే నమ్మగలరా?

ఆ పత్రిక పేరు సెమినార్.

రాజ్, రమేష్ థాపర్ దంపతులు బొంబాయి సిపిఐ పార్టీ తరపున “క్రాస్ రోడ్స్” పత్రిక నడిపేవారు. 1950లో భారత ప్రభుత్వం ఆ పత్రికపై నిషేదాజ్ఞలు విధించినప్పుడు వారు కోర్టు గుమ్మమెక్కారు. అదే మన భారత రాజ్యాంగపు మొదటి సవరణకు దారితీసింది (వాక్ స్వాతంత్ర్యపు హక్కు విషయంలో). కాని తర్వాత, కమ్యూనిస్ట్ పార్టీమీద వారి భ్రమలు తొలగిపోయి, 1959లో కొత్త పత్రిక పెట్టారు. అదే సెమినార్. దీని ప్రత్యేకత ఏమిటంటే “opposing viewpoints within the covers of a single magazine”. 1987లో వారు చనిపోయిన తరువాత వారి గారాలపట్టి మాళవిక, తన భర్త తేజ్ బీర్ సింగ్ (ప్రముఖ రచయిత కుష్వంత్ సింగ్ మేనల్లుడు)తో కలిసి పత్రికను ముందుకు నడిపిస్తున్నారు – థీమ్ లో, టోన్ లో మార్పులేకుండా.

భారత సమాజంలో అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తులతో ఆత్మీయ పరిచయాలు నెరిపే మాళవిక దంపతులు వాటి చాయలేవీ పత్రికలో కనిపించనివ్వరు. (ఎంత విచిత్రమంటే ఇప్పటికీ వారు సాధారణంగా ఏకాంతంగా భోజనం చెయ్యరట. లంచ్ లోగాని, డిన్నర్ లోగాని విదేశీ రాయబారులు, మంత్రులు, ఉన్నతాధికారులూ, తదితరులు విధిగా ఉండాల్సిందేనట!) ఏదో ఒక అంశాన్ని ఎన్నుకోవడం, ఆ విషయమై ‘సంతకం లేని’ సాధికార వ్యాఖ్యానం చేయడం, ఆపై భిన్న దృక్పథాలతో వ్యాసాలుండడం, చివర్లో గత సంచికపై పాఠకుల విసుర్లు… అంతే సెమినార్ పత్రిక అంటే. ఈ పత్రికకు హర్ష సేథీ అన్న అకడమిక్ జర్నలిస్ట్ తన పూర్తి సాయం అందిస్తున్నారు.

ఇక సెమినార్ కవర్ పేజీల్లో ఒక ప్రత్యేకత వుంది. ఈ నెలలోనే సెమినార్ కవర్ పేజీల ఎగ్జిబిషన్ ఢిల్లీలో పెడుతున్నారు. అవి ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. ఆగస్టులో “లిటరరీ ట్రెడిషన్స్” సంచిక రాగా, సెప్టెంబరులో “ది ఐడియా ఆఫ్ రిపబ్లిక్” సంచిక వచ్చింది. ఈ నెల సంచిక నాకింకా అందలేదు. మరి మీరు ఇంతగొప్ప పత్రికను ఏడాదికాలంపాటు తెప్పించుకోవాలంటే వేలూ లక్షలూ తగలెయ్యక్కర్లేదు. కేవలం 400 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. అన్నట్టు మీరు సొమ్మును పంపించాల్సిన చిరునామా:

Seminar Publications, F-46 Malhotra Building, Janpath, New Delhi-110001.

ప్రకటనలు

2 responses »

  1. “ఒక విషయం గురించి ఒకే పత్రికలో భిన్న వ్యాఖ్యానాలుంటే మన తెలుగు మేధావులు జీర్ణించుకోలేరు” అక్షరాలా నిజం. ఈ మధ్య ఇలాంటి సమస్యలే ‘నవతరంగం’లో వచ్చాయి. “ఒకే సినిమా గురించి రెండు విపరీతమైన సమీక్షలు ఎలా ఇస్తారు?” అని. ఏమిటో మన తెలుగు మేధావులు…అన్ని అభిప్రాయాల్నీ ఒకటిచేస్తేగానీ తృప్తిపడరు.

    సెమినార్ పత్రిక గురించి మంచి పరిచయం చేశారు.చందాలు చెల్లించి పోస్టుద్వారా తెప్పించుకునేవాళ్ళను మినహాయిస్తే, హైదరాబాద్ లో ప్రజాశక్తివాళ్ళు ఒకప్పుడు ఈ పత్రికని రెగ్యులర్ గా తెప్పించేవారు. ఈ మధ్య కొనేవాళ్ళు తక్కువయ్యారని,తెప్పించాలావద్దా అనే డైలమాలో ఉన్నారు.అది మన పరిస్థితి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s