ఈ ఏడాది మాన్ బుకర్ ప్రైజ్ వూల్ఫ్ హాల్ కే!

సాధారణం

HilaryMantel2009 సంవత్సరానికి గాను మేన్ బుకర్ ప్రైజ్ హిలరీ మాంటెల్ రచన “వూల్ఫ్ హాల్”కు దక్కింది. జులైలో ప్రకటించిన బుకర్ షార్ట్ లిస్ట్ లో ఆరుగురు రచయితలు నిలిచారు. ఎ. ఎస్. బ్యాట్ (ది చిల్డ్రన్స్ బుక్), జె. ఎం. కొయిజీ (సమ్మర్ టైమ్), ఆదామ్ ఫౌల్స్ (ది క్వికెనింగ్ మేజ్), హిలరీ మేంటెల్ (వూల్ఫ్ హాల్), సిమన్ మావర్ (ది గ్లాస్ రూమ్), సారా వాటర్స్ (ది లిటిల్ స్ట్రేంజర్) వరసగా పోటీలో వున్నప్పటికీ హిలరీ మాంటెల్ కు విజేతగా నిలవడం విశేషం.

ఈ అవార్డ్ కింద 50,000 పౌండ్లు బహుమతిగా రచయితకు లభిస్తుంది. ఫోర్త్ ఎస్టేట్ ప్రచురణ అయిన “వూల్ఫ్ హాల్” ను ప్రచురించింది ఫోర్త్ ఎస్టేట్ సంస్థ. దీంతో ఈ సంస్థకు మొదటిసారిగా బుకర్ అవార్డు వచ్చినట్టయింది. ఇంతకుముందు మూడుసార్లు వీరి పుస్తకాలు నామినేట్ అయినా ఇదే తొలిసారి అవార్డ్ రావడం. ఒకసారి బుకర్ వచ్చాక, ఇక అమ్మకాలు ఊపందుకుంటాయి.

1520లలో ట్యూడర్ కోర్ట్ లో థామస్ క్రామ్ వెల్ ఉద్ధాన పతనాలను వర్ణించిన నవల ఈ “వూల్ఫ్ హాల్“. అయితే ఈ చారిత్రక నవలను రచయిత్రి హిలరీ నడిపించిన తీరు చాలా అసక్తికరంగా వుందని విమర్శకులు మెచ్చుకుంటున్నారు. ఎనిమిదో హెన్రీ సభాకాలంలో రాచకార్యాలనూ రాజనీతినీ ఎంతో చాకచక్యంగా వర్ణించినట్టు అంటున్నారు. మొత్తం ఈ నవల పూర్తికావడానికి హిలరీకి ఐదేళ్లు పట్టిందట. ప్రస్తుతం ఈ నవలకు సీక్వెల్ రాసే ప్రయత్నంలో ఈ అవార్డు రావడం తన కృషికి మరింత ఊపిరినిచ్చిందని ఆమె చెప్తున్నారు.

అసలు బుకర్ ప్రైజుకు ఎందుకింత క్రేజని పెద్ద చర్చ సాహితీ ప్రపంచంలో జరుగుతోంది. ఈ చర్చ విశేషాలు ఎట్లావున్నా బుకర్ లాంగ్ లిస్ట్ వల్లా, షార్ట్ లిస్ట్ వల్లా విపరీతంగా పుస్తకాల అమ్మకాలు పెరుగుతున్నాయని గణాంకాలు చెప్తున్నాయి. నోబెల్ ప్రైజు ఒకవ్యక్తి జీవితకాల సాహిత్య కృషికి అందిస్తారు. పైగా అనేక విభాగాలలో ప్రైజులుంటాయి. అలాగే ఇతర సాహిత్య ప్రైజులు కూడా చాలా విభాగాలలో అందుస్తున్నారు. ఒక్క బుకర్ మాత్రమే కేవలం ఒక పుస్తకానికి అందించడం విశేషం. బహుశా దీనివల్లనేమో దీనికింత క్రేజ్.

అన్నట్టు ఈ పుస్తకం పేపర్ బ్యాక్ ఎడిషన్ ఇండియాలో దొరుకుతోంది. ఫ్లిప్ కార్ట్ లో 299 రూపాయలకే లభిస్తోంది.

ప్రకటనలు

2 responses »

  1. ఎప్పుడూ సూటిగా పదునుగా ఉండే మీ వచనం సాధారణ పత్రికల భాషలా ఉంది ఈ పరిచయంలో. బుకర్ బహుమతి మొదణ్ణించీ కూడా కొంచెం వింతైన ఊహాశక్తికీ విచిత్రంగా ఉండే కథనాలకీ పెద్దపీట వేస్తూ వచ్చింది. మొదట్లో ఈ బహుమతికి అంతగా ప్రాచుర్యం ఉన్నట్టు కనబడదు. కానీ అంతర్జాల ప్రభావం బాగా విస్తరించాక, ఈ బహుమతికి సంబంధించిన వార్తలు వెలువడినప్పుడల్లా ఆయా రచనల అమ్మకాలు బాగా పెరుగుతున్నాయని అంటున్నారు.

  2. oka pustakamgurinchi yemi cheppadaniki lenapudu booker prise win aindano leka nominate aindano yedookati marketlo cheppi sommu chesukovachchukada andukani ilantivi pedataremo sir aina booker prise gelichina anni pustakalu goppavi kakapovachchu.. merenti sir inta simple ga rasaru?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s