ఇవి మీరు తప్పక చదవాల్సిందే!

సాధారణం

కిందటి వారం ఈ బ్లాగులో వచ్చిన “కథో కథకుడో నచ్చకపోతే అదే చెప్పాలి గాని, అబద్దాలాడకూడదు” అన్న వ్యాసానికి మిత్రులు చాలా సానుకూలంగా స్పందించారు. అయితే ఎక్కువమంది ఆ “మాయ” (రచయిత గంటేడ గౌరునాయుడు) కథను, దానిపై జాన్సన్ చోరగుడి రాసిన విమర్శను కూడా అందివ్వమన్నారు.

కానీ సాంకేతికంగా ఆ పనులు చేతకాక ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నప్పుడు విశాఖపట్నంలోని ప్రింటెక్స్ సంస్థ యజమాని ఉమేష్ గొప్ప సాయం చేశారు. “మాయ” కథను, జాన్సన్ విమర్శ వ్యాసాన్ని విడివిడిగా పీడీఎఫ్ పైళ్లు తయారుచేసి అందించారు. వాటిని ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను. దయచేసి వీటిని చదివి మళ్లీ నా వ్యాఖ్యను చదవమని కోరుకుంటున్నాను.

ఇదీ గంటేడ గౌరునాయుడు గారి “మాయ” కథ.

ఇదీ జాన్సన్ చోరగుడి గారి విమర్శ.

దానిపై ఇదీ నా పరామర్శ.

అన్నట్టు ఇంకోమాట- ఈ “మాయ” కథతో పాటు, జాన్సన్ గారి విమర్శ, దానిపై ప్రముఖ కథా రచయిత అట్టాడ అప్పలనాయుడి పరామర్శ, శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటంపై పుస్తకాన్ని రచించిన ‘వెంకట్’ రాసిన పరామర్శ, నా పరామర్శ లతో కలిపి ప్రచురించిన బులెటిన్ మీరు పోస్టులో అందుకోవాలంటే నాకు రెండు హలోలు (అంటే ముళ్లపూడి భాషలో పది రూపాయలు) కేవలం ఎంవో చేయాలి. మారని నా చిరునవ్వూ చిరునామా మీకు తెలిసినవే కదా! త్వరపడండి మరి.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s