ఈ ఏడాది గొప్ప రచయిత్రులే లేరట!

సాధారణం

PWK11209coverపుస్తకాల వ్యాపార ప్రపంచం అయిన “పబ్లిషర్స్ వీక్లీ” ఈ ఏడాది ఉత్తమ రచనల జాబితా తన తాజాసంచికలో ప్రచురించింది. కానీ, అది అమెరికావ్యాప్తంగా స్త్రీలకు కన్నెర్ర చేయించింది. దానికి కారణం 2009లో “పీ డబ్ల్యు” ఎంపికచేసిన టాప్ లిస్ట్ జాబితాలో ఒక్క రచయిత్రి రచన చోటుచేసుకోకపోవడమే.

గార్డియన్ పత్రిక నెమ్మదిగా కలగజేసుకుని, మహిళా రచయిత్రుల అసమ్మతికి గళమిచ్చింది. విమెన్ ఇన్ లెటర్స్ అండ్ లిటరరీ ఆర్ట్స్ అనే గ్రూపు వ్యవస్థాపకురాలు కేట్ మార్విన్ దీనిపై విరుచుకుపడిన వైనానికి ఫుల్ సీన్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక్క రచయిత్రి రచనైనా గుర్తించకపోవడం దారుణమంది.

దీనిపై వ్యాఖ్యానిస్తూ పబ్లిషర్స్ వీక్లీ రివ్యూస్ డైరెక్టర్ లూయీజా ఎర్మెలెనో ఇలా వాపోయిందట. “మేము నిజానికి ఈ జాబితా ప్రిపేర్ చేసినపుడు జండర్ నూ జానా నూ (రచయితలెవరన్నదీ, ప్రక్రియ ఏమిటన్నదీ) పట్టించుకోలేదు. కానీ చివరికి మా జాబితా అంతా కేవలం రచయితలతోనే నిండిపోయేసరికి ఇబ్బంది కలిగింది.”

మీకోసం ఇక్కడ ఈ సారి అమెరికాలో 2009లో మోస్ట్ పాపులర్ పుస్తకాలుగా నిలిచిన టాప్ టెన్ జాబితా ఇస్తున్నాను. తొమ్మిదో పుస్తకం పేరు ఒక్కసారి చదువుదురూ.  (అవునూ, మన తెలుగులో ఇలాంటి ప్రయత్నాలు ఎప్పుడు జరుగుతాయో కదా!)

1. Cheever: A Life
Blake Bailey (Knopf)

2. Await Your Reply
Dan Chaon (Ballantine)

3. A Fiery Peace in a Cold War: Bernard Schriever and the Ultimate Weapon
Neil Sheehan (Random House)

4. In Other Rooms, Other Wonders
Daniyal Mueenuddin (Norton)

5. Big Machine
Victor LaValle (Spiegel & Grau)

6. The Age of Wonder: How the Romantic Generation Discovered the Beauty and Terror of Science
Richard Holmes (Pantheon)

7. Stitches
David Small (Norton)

8. Shop Class as Soulcraft
Matthew B. Crawford (Penguin Press)

9. Jeff in Venice, Death in Varanasi
Geoff Dyer (Pantheon)

10. Lost City of Z: A Tale of Deadly Obsession in the Amazon
David Grann (Doubleday)

ప్రకటనలు

2 responses »

  1. మనవాళ్ళ రచనలు “గోడలు”, “మేడలు”, “కతలు” “వెతలు” ఎవరైనా వీళ్ళకు పంపించాల్సింది. పాపం పబ్లిషర్స్ వీక్లీ..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s