…ఓ పాఠకుడి స్టేట్ మెంట్…

సాధారణం

నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను ఉత్తుంగ తరంగంలా వ్యక్తం చేస్తున్నప్పుడు…. వారి మనసు గుర్తెరిగి వారి ఆత్మగౌరవ నినాదాన్ని మన్నించి… వారి ప్రయత్నాలను గౌరవించాల్సింది పోయి… ఇవ్వాళ రాష్ట్రంలో జరుగుతున్న దారుణ దురాగతాన్ని నివ్వెరపోయి చూస్తూ… చాలా రోజులు మౌనంగా వుండిపోయాను. నిరాశతో… నిస్సత్తువతో…

ఒకవైపు వరసపెట్టి సంభవించిన ఆత్మీయుల మరణాలు… వై ఎస్ రాజశేఖర రెడ్డి, కె ఎన్ వై పతంజలి, కె. బాలగోపాల్ శాశ్వత నిష్క్రమణల తర్వాత నన్ను చిన్నప్పుడు తన భుజాల మీద పోసి పెంచిన నా ఆత్మబంధువు రామారావు మాయ్య (చిన్నప్పుడు చిల్లర డబ్బులు ఎప్పుడు పడితే అప్పుడు, ఎంతకావాలంటే అంత ఇచ్చేవాడని ముద్దుగా డబ్బుల మాయ్య అని పిలుచుకునేవాడిని) ఆకస్మిక మృతి… నన్ను విపరీతంగా కుంగదీశాయి. వాటినుంచి కాలం క్రమక్రమంగా మరుపుపూత పూస్తుండగానే వైఎస్ ఆకస్మిక మరణం తర్వాత అసలుసిసలు ప్రజానాయకునికి వచ్చే ఆదరణ చూసిన కె. సి. ఆర్ వెంటనే తెలంగాణ విషయమై తాడోపేడో తేల్చుకోవాలనుకున్నారు. ఉద్యమరంగంలోకి ఎంతో నిబద్దతతో తెలంగాణ ప్రజలంతా దుమికారు. వారి స్పష్టమైన ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఒక ప్రకటన విడుదల చేయగానే ఊహించ(లే)ని పరిణామాలు రాష్ట్రంలో ఎదురయ్యాయి. వరసగా జరిగిన పరిణామాలతో అందరమూ నిశ్చేష్టులమవుతున్నాం.

మద్రాసు స్టేట్ ప్రొవిన్స్ లో ఇప్పటి కోస్తాంధ్ర, రాయలసీమ, కళింగాంధ్ర ప్రాంతాలు కలిసివున్నప్పుడు (అప్పుడు కేవలం మూడు కోట్లమంది ప్రజలే) మద్రాసు నుంచి ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఏర్పాటుచేయడానికి ఏయే కారణాలు చూపించామో… అవే కారణాలతో ఇప్పుడు (బలవంతంగానూ, మాయమాటలతోనూ ఆంధ్రలో కలపబడ్డ హైదరాబాద్ స్టేట్ ప్రొవిన్స్ ప్రజలు నాలుగు కోట్లమంది) తెలంగాణగా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటుచేయమని కోరడం భారతదేశ చరిత్రలో గుర్తించదగిన అంశం.

ఇక వై ఎస్ చనిపోయిన వెంటనే ఈ డిమాండ్ ఇంతలా పెల్లుబికడానికి కారణాన్ని తరచి ప్రశ్నించుకుంటే నాకిలా కనిపిస్తోంది. (వై. ఎస్ రాజకీయ వ్యక్తిత్వాన్ని అంచనా వేసేప్పుడు మూడు భాగాలుగా ఆయన వ్యక్తిత్వాన్ని అంచనావేయాలి. ఒకటి మూతలేని మూకుడులో వుంచిన ఎండ్రకాయల మాదిరిగావున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంలో ఒక కాంగ్రెస్ నాయకుడిగా ఒక పక్కా రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యం గలిగిన నాయకుడు వై ఎస్ నేరారోపిత జీవితం. రెండు ప్రజాప్రస్థానం పేరుతో రాష్ట్రమంతటా పర్యటించిన తరువాత వై ఎస్ రాజనీతిపరుడి జీవితం. మూడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు రాబట్టాల్సిన బాధ్యత కలిగిన ఫక్తు రాజకీయనాయకుని జీవితం.)  ఆయన తెలంగాణ ప్రాంతం మీద విపరీతంగా ప్యాకేజీల ధన వర్షం కురిపించడమే కాకుండా తెలంగాణ ప్రాంతమంతా నీటి పారుదల కోసం పూనుకున్నాక ఆ పనులన్నీ ప్రారంభ స్థాయిలో వున్నప్పటికీ కేవలం ఆ డిమాండ్ తోనే మనుగడలోవున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్ ఎస్) ఉనికినే ప్రశ్నార్ధకం చేయడం ఆ నాయకులకు మతులు పోగొట్టింది.

మరి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉవ్వెత్తున ఎగిసిన ప్రజల ఆకాంక్షలకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనకు (చిదంబరం మొదటి ప్రకటనగా పిలుస్తున్నాం) ప్రతిస్పందనగా రాయలసీమ, కోస్తాంధ్ర, కళింగాంధ్రలలో ఒక్కసారి పెల్లుబికిన నిరసనను కళ్లారా చూసిన నేను మొత్తంగా ఆ సంఘటనను అర్థం చేసుకోలేకపోయాను. బహుశా సోషియాలజిస్టులు కూడా ఈ ప్రతిస్పందనను విశ్లేషించలేరేమో! ఎందుకంటే ఇది ఒక బహుళస్తరిత దృగ్విషయం (మల్టీలేయర్డ్ ఫినామినాన్). ఆంధ్రా యూనివర్శిటీలో రాత్రికి రాత్రే ఒక గోదావరి జిల్లాకి చెందిన ప్రజాప్రతినిధి డబ్బుల జీపులు ప్రత్యక్షంగా చూసిన విద్యార్థి నాయకులు ఆవేశపూరితంగా రోడ్డెక్కడం ఎవరు విశ్లేషించగలరు? నిరుద్యోగ సమస్య, కెరీరిజంతో సతమతమవుతున్న యువత రోడ్డెక్కితే వినూత్న రీతుల్లో దుశ్చర్యలకు దిగడాన్ని ఎలా విశ్లేషించగలం? మేము విడిపోతామురా బాబోయ్ మొర్రో అంటే కలిసుందాం అంటున్న కోస్తా నాయకులతో గళం కలిపి అన్ని శిబిరాల్లో కూర్చున్న అన్ని రాజకీయ పార్టీల నేతల్ని, వారి అసలు ఉద్దేశాలను, వారి మనోగతాలను ఎవరు తెలుసుకోగలరు?

రాజకీయ నాయకులది ఒక రకమైన స్వార్థమైతే, పత్రికలది మరో రకం స్వార్థం, టీవీ చానెళ్లది ఇంకో రకం పైత్యం. పాపం దీనిలో ఏ స్వార్థమూలేని ప్రజలు మాత్రం పావులై అనవసరమైన ఎమోషన్స్ తో, స్లోగన్లతో, తమ సమయాన్ని, డబ్బునీ వృథా చేసుకున్నారు, కుంటున్నారు. ఉదాహరణకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ప్రజలకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటుకావడం సంబంధంలేని విషయం. కళింగాంధ్ర ప్రజలకు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు వల్ల లాభంగాని, నష్టంగాని ఏమాత్రం లేదు. అయినా రాజకీయ నాయకులవల్ల, పత్రికల వల్ల ఒక రకమైన సెంటిమెంట్ ప్రజలలో వ్యాపించింది. ఈ నేలను తెలుగుతల్లిగా ఒక కృత్తిమ భావన చేసుకున్నారు. నిజానికి ఇదంతా కోస్తా లాబీ కుట్రగా మనమంతా గుర్తించాలి. రాష్ట్రం విడిపడడమంటే తెలుగుతల్లి ముక్కలవడంగా ప్రచారం జరిగింది. నిజానికి అది మిధ్యా భావన.

దేశాన్నే అవసరమనుకుంటే విభజించుకోవడం సర్వసాధారణమైనప్పుడు రాష్ట్రం గురించి ఆలోచించాల్సిన పనిలేదు. ఉదాహరణకు తూర్పు పాకిస్తాన్ మనవల్లే బంగ్లాదేశ్ గా మారింది. అందాల కశ్మీరాన్ని సైతం ఒక ప్రత్యేక దేశంగా గుర్తించిన నాడు మనదేశానికి ప్రతి ఏటా కొన్నివేలకోట్ల రూపాయల ఆదా జరుగుతుంది. పైగా అక్కడి ప్రజలు ఈ రెండు దేశాల అకృత్యాలవల్ల విసిగివేసారిపోయి నిజంగా ప్లెబిసైట్ నిర్వహిస్తే, ఇటు ఇండియాలోనో, అటు పాకిస్తాన్ లోనో కలవక ప్రత్యేక దేశంగా వుండాలనే కోరుకుంటారు. పైగా అలా ప్రత్యేక దేశం కావడంవల్ల వారికి పర్యాటక రంగం వల్ల వచ్చే ఆదాయంతోనో కొద్ది సంవత్సరాలలోనే ఆర్థికంగా చాలా నిలదొక్కుకునే స్థితికి చేరుకుంటారు కశ్మీర ప్రజలు.

విభజన అనేది మానసికమైనది కాదు. కేవలం పాలనపరమైనది. మొన్నటికి మొన్న నియోజకవర్గాల పునర్విభజనలో మా జిల్లాలో ఏకంగా మూడు నియోజకవర్గాలు ఎగిరిపోయాయి. అంటే వాటిని తీసికెళ్లి దగ్గరలోవున్న బంగాళాఖాతంలో కలిపేశారని కాదు కదా! దేశాన్ని రాష్ట్రాలుగా, రాష్ట్రాన్ని జిల్లాలుగా, జిల్లాలను మండలాలుగా విభజించుకోవడం కేవలం పరిపాలన సౌలభ్యం కోసమే. పైగా దేశ రాజధాని శ్రీకాకుళం జిల్లా ప్రజలకు మరీ దూరమైపోయింది, అదే విశాఖపట్నంలోనో, విజయవాడలోనో వుందనుకోండి… ప్రజలకు ఎంత సౌకర్యంగా వుంటుంది కదా! పైగా ఈ మూడు జిల్లాల ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం వల్ల ఉపాధి అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి. వేరే రాష్ట్రాలకు వెళ్లడానికి మనకేమీ పాస్ పోర్టులు అక్కర్లేదు కదా. పాతపట్నం మా చెల్లెలి ఇంటికి వెళ్లినప్పుడు సాయంత్రం నడుచుకుంటూ పర్లాకిమిడి వెళ్లి బజారు చేసుకుంటూ అక్కడే భోజనం చేసి, సెకండ్ షో సినిమాకు వెళ్లాం. రాత్రి పన్నెండు గంటలకు ఆటో మీద వచ్చేస్తున్నప్పుడు రాష్ట్ర సరిహద్దులు దాటుతున్నామని కూడా తెలియకుండా ఏవో కబుర్లు చెప్పుకుంటూ వచ్చేశాం.

తెలంగాణ ఏర్పాటైతే ఆ ప్రాంతం చుట్టూ రెండు మీటర్ల లోతు కందకం తవ్వి సెపరేట్ చెయ్యరు. దర్జాగా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఎలా కావాలనుకుంటే అలా అక్కడకు వెళ్లొచ్చు – ఇప్పుడు మనం షిర్డీ వెళ్తున్నట్టు (ముక్తి కోసం), కలకత్తా వెళ్తున్నట్టు (ఉపాధి కోసం). పైగా లగటపాటి ఊరికే బఫూనరీ చేస్తున్నాడుగానీ ఆయనకు హైదరాబాద్ లో ఎంత ఆస్తివుందో అంతే ఆస్తి గోవాలో, పంజాబ్ లో, మహారాష్ట్రలో కూడా వుంది. పేరుకి ఒక్క లగడపాటిని ప్రస్తావించాను గాని, అలాంటి గుండెలు బాదుకుంటున్న బూర్జువాలెందరో  ఎంతోధీమాగా వుంటూనే ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. ఉదాహరణకు రామోజీరావును తీసుకోండి, చంద్రబాబులాంటి సిగ్గుమాలిన రాజకీయనాయకులకు బిస్కట్లు విసిరి వైజాగ్ తదితర ప్రాంతాలలో పచ్చళ్లు, పేపర్లు అమ్ముకుంటున్న మనిషి… తెలంగాణ చేరుకున్న రెండు దశాబ్దాలలోనే కొన్ని వేల ఎకరాల భూమిని కారు చౌకగా కాజేసి, కనీసం నామమాత్రంగానైనా బెంగ పడట్లేదు. కొన్ని వందల రూపాయలయినా అక్కడ పెట్టుబడి పెట్టని నా జిల్లా ప్రజలకు… కందకు లేని దురద కత్తిపీటకెందుకని నా కోపం.

….ఇంకావుంది

ఒక స్పందన »

  1. రవి గారు. మన శ్రీకాకుళంలో ఎవరూ స్వచ్ఛందంగా బంద్ పాటించలేదు. రాజకీయ పార్టీల కార్యకర్తలే బలవంతంగా షాపులు ముయ్యించారు. సమైక్యవాద టి.వి. చానెళ్ళలో మాత్రం శ్రీకాకుళంలో బంద్ సంపూర్ణం, శాంతియుతం అని వార్తలు వచ్చాయి. హైదరాబాద్ లో రూపాయి పెట్టుబడి పెట్టనివాళ్ళకి బంద్ పాటించాల్సిన అవసరం లేదు. మీరు చెప్పింది నిజమే. రామోజీ రావుకి లేని బాధ వెనుకబడిన ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లా వాళ్ళకి ఎందుకు?

  2. దుప్పల రవికుమార్ గారు మీ నాన్న గారు ఏమి చేస్తుండేవారు ? మీరు పుట్టినప్పటి నుంచి సాఫ్ట్ స్కిల్ ట్రైనేర్ గానే ఉన్నారా ? ఈ రోజు మీకు ఎంత ఆస్తి ఉందో మీ చిన్నప్పటినుంచి అంటే ఉందా? అసలు ఇందంతా కాదు మీరు ఈ బ్లాగ్ రాయటమనేది మీ చిన్నప్పనుంచి చేస్తున్నారా ? వైజాగ్ తదితర ప్రాంతాలలో పచ్చళ్లు, పేపర్లు అమ్ముకుంటున్న మనిషి >> ఈ వాఖ్యలు రాయటానికి మీకు సిగ్గు గా లేదు ? వీటిని విమర్శలు అనరు పక్క వాడిని చూసి ఏడిసి వాగే పిచ్చి కూతలు అంటారు . రామోజీ పెద్ద పుడింగి సద్ఘున సంపన్నుడు అని నేను అనను కాని ఈ పచ్చళ్ళు అమ్మటం తప్పు పనా ? పచ్చళ్ళు , పేపర్లు అమ్ముకునే వాడు డబ్బు సంపాదించకూడదని ఏమన్నా రూల్ ఉందా ? పెద్ద అభ్యుదయవాది అని ఫీల్ అవుతున్న మీకు , కులపిచ్చి ఉన్నవాడి కి తేడా ఏమిటి ?
    చిదంబరం ప్రకటన తరవాత పెద్ద ఎత్తున వ్యతిరేకత రావటానికి కారణం కెసిఆర్ ఆయన తో పాటు ఆయన చెంచాలు పేలిన అవాకులు చెవాకులు అని మీకు ఇంత వరకు తెలియదా ? ఆంధ్ర వాళ్ళు అందరు దొంగలు మమ్మలిని దోచుకుంటున్నారు , తెలంగాణా వచ్చాక ఆంధ్ర వాళ్ళను తరిమి తరిమి కొడాతము అన్న మీరు విశాల హృదయం తో అర్ధం చేసుకొంతరేమో జనాలుకు అంత తెలివి లేదు లెండి మీ అంత మేధావులు కారు కదా .
    మీ టపా చదివిన తరవాత నాకు కలిగిని అభిప్రాయం చదువు కున్న వాడి కన్నా — మేలు . అల్లాగే పుస్తకాలు చదవగానే బుద్ది పెరగదు అని !

  3. రవి గారు.. నమస్తే మీరు చెప్పిందంతా బాగానే ఉంది కానీ విడిపోతే అసలు నష్టాలే ఉండవంటారా….??? విభజన మానసికం కాదు అని మీరంటున్నారు.. కానీ వాళ్లు భాగో అంటున్నారు మరి… మీరు అనొచ్చు వాళ్లు పెట్టుబడి దారుల్ని మాత్రమే వెళ్లమన్నరని.. కాని మొన్న అక్కడ బాంక్ ఉద్యోగం చేస్కుంటున్న ఇళ్ల మీద పడ్డారు.. రామోజి గురించి అన్నారు.. పచళ్లు అమ్మే వాళ్లంటే మీకెందుకు చులకన???

    • Where were you when KCR said bago. Appude enduku udyamam cheyyaledu appude enduku kandichaledu, everi meeda evaru dadi cheyyaledu adi antha media srusti.
      Telangana ante KCR kadu , kCR ante telanganalo chala mandiki istam ledu kani separate telangana kavalanukuntunnaru

  4. అంధ్రలో చేస్తే అది రాజకీయనాయకులు చేస్తూ నట్టు ,తెలంగాణా లో చేస్తే అది ప్రజల చేస్తూనట్టా?
    O U లో తెరాస వాళ్ళు డబ్బులు పంచిన విషయం మీకు తేలీదు ఏమో?
    నువ్వు నయం దర్మం అని మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది
    అసలు తెలంగాణా అంటున్న వాళ్ళందరూ ఎవడో ఒకడి మీద పది ఏడవడం తప్ప …వాళ్ళు ఎలా బాగు పడాలో ఆలోచించారు …
    కొందరు మాత్రం ఆలోచిస్తున్నారు ,వాళ్ళే రాజకీయనాయకులు

  5. hi sir,

    విభజన, సమైఖ్యం లాంటి పదాల్ని కాసేపు పక్కన పెడదాం. అభివృద్ధి, ఆత్మగౌరవం ఎవరో ఎక్కడ నుండో వచ్చి లాక్కోవడమో లేదా ఇవ్వడమో జరుగదు అని అనుకుంటున్నా, ఎందుకంటే, ముంబై నుండి వచ్చి కె జి బేసిన్ లో చమురు నిక్షేపాలు వెలికి తీసే కాంట్రాక్టు ని దక్కించుకున్నది ఇక్కడ(తెలంగానా లో) దగా కోరులు గా కబ్జాదారులు గా మన్ననలొందుతున్న కొస్తా వాల్లు కాదు, అధమం అంధ్రా వాల్లు కూడా కాదు, మన పొరుగున ఉన్న మరాఠీలు,, అలా అని తెలుగు వాల్లు చచ్చు దద్దమ్మలు అని నెను అనను, ఢిల్లీ విమానాశ్రయం కట్టింది మన జి ఎం ఆర్ వాల్లె కదా, ఇవన్ని చూస్తుంటె, అసలు సమస్య ఇంకెక్కడొ ఉన్నట్టు అనిపించట్లెదా, కె సి ఆర్, లగడపాటి, టి జి వెంకటెష్ వీల్లంతా, స్వజనొద్ధరనకు, తమ ఆస్తుల సంరక్షణ కు, పదవుల ప్రాపకానికి పాటు పడ్డం తప్ప, నకిలీ వుద్యమం ముసుగులో అన్యాయం అయిపోతున్న నిర్భాగ్యుల జీవితాల్లొ వెలుగు కాదు కదా, దాని ఆనవాల్ల కోసం కూడా ప్రయత్నించట్లేదు. రెచ్చగొట్టె ప్రసంగాలు చేసి, విద్వేష పూరితమైన ఆలోచనలను మెదడుకెక్కించి అటు సీమాంధ్ర ప్రాంతాన్ని, ఇటు తెలంగానను కాష్ట్నం లా మండిస్తున్నది, మన ఉద్యమ నాయకులే, కె సి ఆర్ సెలైన్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టే ముందు రోజు ఆయన గారి మేనల్లుడు హరీష్ రావు గారు మీద అర్థ లీటరు పెట్రొలు పోసుకొని హంగామ సృఇష్టించారు, ఈ ఆత్మహత్యల పర్వానికి నాంది అక్కడే పలికించారు, ప్రారంభింపరు.. అన్న పద్యం లో అధముడిలాగా కార్యొన్ముఖుడైన మన హరిష్ గారు ఎందువల్లనో ఇప్పటి దాక అగ్గిపుల్ల గీసి వొల్లు కాల్చుకోవడం లో తాత్సారం చేస్తూనే ఉన్నారు. కాని ఈ సన్నివేశం చూసిన ప్రజలు మాత్రం ఆ పనిని పూర్తి చేస్తున్నారు, ఉద్యమం పేరుతో అందర్ని రెచ్చగొట్టి విద్వంసానికి మాత్రం ప్రభుత్వమే కారణం అంటూ చాటుగా వీలైనంత విధ్వంసాన్ని ప్రేరేపించే ఈ కుటిల రాజకీయ నాయకులు నాయకత్వం వహిస్తున్న ఈ ఉద్యమాలను(అది తెలంగాన కావచ్చు సీమాంధ్ర కావచ్చు), సపోర్ట్ చేసే వాల్లు ఇంకెంత ఆలోచనాపరులై ఉంటారని అనుకుంటున్నారు. మనం ప్రస్తుతమున్న పరిస్తితుల్లో ఉద్యమం అవసరమా, అవసరమైతే దానికి కారనం ఎమై ఉండాలి, ఎదిరించాల్సింది పొరుగు ప్రాంతం వాల్లను కాదు, కాల్చాల్సింది మనందరి బస్సులను కాదు, నాశనం చెయ్యాల్సింది మన ఆస్తులు కాదు, మన సొంత వూరి లోనె ఉంటూ మన నోటి కాడ కూటి ని లాక్కుంటున్నారే, వాల్లని ఎదిరిద్దాం, రాష్ట్రం కలిసున్నా విడి పోయినా జరిగేది ఒక్కట్టే, ఆల్రెడీ నిండిన జేబులు నిండుతూనే ఉంటాయి, మనల్నిక్కడ ఈ ఉద్యమాల్లో బిజీ గా పెట్టి, వాల్లు ఇళ్ళు చక్కబెట్టుకొంటున్నారు, మరి వీల్లనెదిరించడానికి ఉద్యమాల్లేవే?…………… ఇంత చెప్పినా అసలింతకూ నువ్వు తెలంగానా ని సపోర్ట్ చెస్తావా, సమైఖ్యాంధ్ర ను సపోర్ట్ చెస్తావా అనే వాల్లు కూడా ఉన్నారు, వాల్లకు నేను ఇచ్చే సమధానం ఒక్కటే, నిస్సహాయమైన చూపు, ఒక నిట్టూర్పు.

    ఇక మీకొచ్చిన కొన్ని కామెంట్స్ లో కొద్దిగా వ్యతిరేకతని, కొన్ని చోట్ల తీవ్రమైన వ్యతిరేకతని గమనించాను, నాకు తెలిసి మన ఖంఢింపులు సమర్థింపులు చివరాఖరికి ఇంకో ఖంఢింపు ని లేదా సమర్థింపు కి దారి తీస్తాయే తప్ప ఒక పరిష్కారాన్ని వెతికె చర్యలు కావు అని నా అభిప్రాయం. బదులుగా మన బతుకు మనం బతికి పక్క వాల్లను కూడా ప్రాశాంతంగా బతకనిస్తే చాలు. ఇది విని వీడికి దేసం పట్ల ఏమాత్రం ఆలొచన ఉన్నట్టు లేదు అని అనుకొనే జీవులు కూడ ఉంటారు, వాల్లకోసం ఒక సమాధానం, ఈ ఉద్యమాల సమయం లో, భాగ్యనగరం లో బతకాల్సిన ఖర్మ పట్టిన యే జీవుడైనా ఇంతకు మించి వేరే ఎమీ కోరడు. ౠజువు కావాలంటె సిటీ బస్సుల్లొ తిరిగే ఎవ్వడినైనా అడగండి చెప్తారు.

    ప్రస్తుతానికి సెలవు
    మీ రాజు

    • Raju,
      //అభివృద్ధి, ఆత్మగౌరవం ఎవరో ఎక్కడ నుండో వచ్చి లాక్కోవడమో లేదా ఇవ్వడమో జరుగదు అని అనుకుంటున్నా..//
      Mari enduku ave peruto Andhra rastramkoraki poradaaru, enduku atmagauvravam perita annagaru party petti rajyadhikaram chepattaaru? vaallu mosakaarula?

      Deeniki meeku javabu dorikinappudu telangana udhyamamlo kadam tokkutunna telangana janaala aakanksha meeku ardham avutundhi,..2 nelala taruvata idhnata choosi ippudu ledhu asalu udhyamame ledhu, swardhaparule telangana peruto business chesukuntunnaru ani meeru ante, meeku inka cheppedemiledhu.

  6. కనీసం ఈ ఉద్యమం చేస్తున్నామని చెప్పుకునే తెలబాన్లు కనీసం కాపురం అయినా చేస్తున్నారో, వాళ్ళని కూడా వేరుగా ఉండమంటున్నారో వారికే తెలియాలి ,రాతి యుగాలని కళ్ళముందు చూపిస్తున్నారు, వీళ్ళకి చేతకాక పక్కింటివాడి మీదపడి ఏడ్చిచస్తున్నారు,ఇప్పుడు ప్రాంతాలవారిగా ఏడుస్తున్నారు, భవిష్యత్తులో భువనగిరివాళ్ళు ,వరంగల్ వారిని దోచుకుంటున్నారని, కరీంనగర్ వాళ్ళు భువనగిరివాళ్ళని దోచుకుంటున్నారని ఏడిచి చివరకు వీధులవారిగా విడిపోతేకాని వీళ్ళ ఏడుపు ఆగేలాలేదు. జై కాజీపేట. జై జై కాజీపేట.ఎప్పటికైనా కాజిపేట సపరేటు కావాలని కోరుకుంటూ మరొక్కసారి మీరూ అనండి జై కాజీపేట. జై జై కాజీపేట.

  7. “ఈ నేలను తెలుగుతల్లిగా ఒక కృత్తిమ భావన చేసుకున్నారు. రాష్ట్రం విడిపడడమంటే తెలుగుతల్లి ముక్కలవడంగా ప్రచారం జరిగింది. నిజానికి అది మిధ్యా భావన.”
    రవి గారు ఇది మీరు రాసిందేనా? లేక మరెవిరిదన్నా ఇక్కడ ప్రచురించారా?
    “నిజానికి ఇదంతా కోస్తా లాబీ కుట్రగా మనమంతా గుర్తించాలి.”
    ఈ కోస్తా లాబీ అంటే ఏంటండి? రాయలసీమ, కళింగాంధ్ర, తెలంగాణా మరి ఏ ఇతర లాబీలు చెయ్యని కుట్రలు వీరు ఏమి ఎందుకు చేస్తున్నారు? కొంచెం వివరంగా చెప్తారా?

  8. గ్రామ దేవత అనేది ఎలా ఊహాజనితమో, తెలుగుతల్లి అనేది కూడా అలాగే ఊహాజనితం. తెలుగుతల్లి ఉందని ఏ పురాణంలో వ్రాసి ఉంది?

  9. ఆర్యా! రవి కుమార్ గారూ,ఎలా వున్నారు? చాల రోజులయ్యింది. మీ వాదనలోని ప్రాంతీయ వాదాన్నీ,ఆవేదననూ గమనించాను.అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించాను.కళింగాంధ్రప్రాంతం
    ఆంధ్ర ప్రదేశ్ లో భాగంగావుండటాన్ని మీరు యిష్ట పడటంలేదని నేను భావిస్తున్నాను.
    రాష్ట్రం సమైక్యంగా వుండాలని కళింగాంధ్ర,,కొస్తాఆంధ్ర, రాయలసీమ ప్రాంతీయులు కోరుకోవడానికి,అందుకై వుద్యమించడానికి అనేక కారణాలున్నాయి.
    పెట్టుబడి దారుల వ్యవహారాలేవైనా, దానికి అతీతంగా ప్రజల అంతరాంతరాళాలలో జరుగుతున్న సంఘర్షణకు యీ క్రింది కారణాలు కొన్ని…. అందులో…..
    మొదటిది: అప్పట్లో వున్న రాజధానిని వదులుకుని కోస్తాంధ్ర,సీమ నాయకులు,కళింగాంధ్ర, కోస్తాంధ్ర,రాయలసీమల అభివ్రుద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసి కొత్త రాజధాని హైద్రాబాద్ ను,పారిశ్రామికంగా అభివ్రుద్ధి చేస్తూ, కెంద్ర ప్రభుత్వ భారీ పరిశ్రమలన్నీ అక్కడే కేంద్రీకరించి, వుపాధి అవకాశాలన్ని అక్కడే ప్రోది చేయడం వల్ల ,అనుబంధ పరిశ్రమలూ,అనుబంధ వ్యాపారాలూ,వుపాధి అవకాశాలు యేర్పడటమ్ వల్ల, అవన్నీభవిష్యత్తులో,తెలంగాణ పరమై.
    వారికే పరిమితమై పోయి(ఒకవేళ తెలంగాణ హైద్రాబాద్ తో సహా విడివడితే,) శాశ్వతంగా, సీమాంధ్ర ప్రాంత పు భావితరాలకు దక్కవనే దుగ్ధ.
    రెండు: లోగడ వున్న కర్నూలు రాజధానిని , అభివ్రుద్ధి దిశగా అడుగులేసే తొలి దశలో కోల్పోయి హైద్రాబాద్ కు తరలి రావడం. మరల యిప్పుడుమరో రాజధానికై సిద్ధపడాలంటే
    కలుగుతున్న అవ్యక్తభరిత మానసిక సంఘర్షణ.అశక్తా భావన.

    రాజధాని నగరం తమదిగా భావించిమానసిక అనుబంధం యేర్పరచుకుంటే ఆయా గ్రామాలలోని వారి కుటుంబీకులు, బంధువులు గత యాభై సంవత్స్తరాలుగా భాగ్య నగరం తో ప్రఘాఢ సానిహిత్యాన్ని పెనవేసుకున్నారు.

    సెపరేషన్ డిమాండు, తెలంగాణీయులలో గత యాభై యేళ్ళుగా ఎంతగా పాతుకు పోయిందో,
    కలిసి వుండాలనే భావన యితరప్రాంతీయులలో యాభై యేళ్ళుగా, వారి గుండెల్లో అంతే లోతుల్లో పాతుకు పోయి వుంది.

    దానికి ముఖ్య కారణం ఒకే చోట కేంద్రీక్రుతమైన పారిశ్రామికీకరణ. భారీ పరిశ్రమలు. అనుబంధ పరిశ్రమలు,అనుబంధ వ్యాపారీకరణ, విస్తరించిన విద్యారంగం, కార్యాలయాలూ,వైద్యరంగం కార్యాలయాలూ, పరిశోధనాలయాలూ,
    రైల్వే,డిఫెన్స్ ,డిఫెన్స్ ల్యాబులూ,కేంద్ర విశ్వవిద్యాలయమూ,అయ్ .అయ్. టి,యింకా ఎన్నెన్నో.

    ఆంధ్ర రాష్ట్రమేర్పడిన తరువాత కోస్తాంధ్ర సీమ ప్రాంతాలలో వచ్చిన ,ఒకే ఒక్క భారీ పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్..విజయవాడధర్మల్ విద్యుత్ ప్లాంటు మాత్రమే.

    అప్పటి నాయకులు పరిశ్రమలను డీ సెంట్రలైజ్ చేసి జిల్లాకొక్కటి చొప్పునభారీ, మద్య తరగతి పరిశ్రమలను స్థాపించి వుంటే, విడిపోదామని ఎవరన్నాకాదనే వారు కాదేమో.కలిసే వుందామని భావించే వారు కాదేమో.

  10. హైదరాబాద్ లో కూడా ధనవంతులు, ముఖ్యంగా సినిమావాళ్ళు, సాఫ్ట్ వేర్ కంపెనీలవాళ్ళు ఉండే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, లింగంపల్లి లాంటి ప్రాంతాలలోనే అభివృద్ధి జరిగింది. కొన్ని చోట్ల 20 ఏళ్ళ క్రితం వేసిన లేఅవుట్లలో కూడా ఇళ్ళు కట్టలేదు. సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉన్న ప్రాంతాలలో మాత్రం రియల్ ఎస్టేట్స్ ధరలు కోట్లలో ఉంటాయి.

  11. // Nutakki Raghavendra Rao // meeru cheppndi chala santhosham… vridiga bavinchina varike ala vunte…. Telangana vallaki swathaha dakkalsina dani gurinchi yinkentha undalantaru… oka ammayi + abbayi yiddaru valla abhiprayala meraku kalisiundamanukovadam PREMA antaru, kani okaru nuvvu naku vaddu antunte… yedutivallu naaku nuvvekavali.. neethone unta… naku kakunda ninnu brathuka niyya ante adi UNMADHAM avuthundi…. yidi yenduku cheppanante.. yee kalayika SWACHHANGA kaledu.. modatinundi kotlatale.. sammathanga ledu.. kondaru antaru yini rojula tharuvatha yendukani. vallandariki cheppedi okkate.. rojulanevi gadusthuntayi, avi nelalu, samvassaralu avuthu unna.. modatinunde madi maku kavali anttunnaru thappa yippudedo kottaga adigaru anukovadam thappu.

  12. samaikhya vadaniki ardhame ledu…endukante mugguri lo oka sodarudu kalisundalani modatinundi anukovatledu..migitha iddaru sodarulu balavantha pettadame ikada kosamerupu.. ala enduku nanu balavanthapedthunaru ani telagana sodarulu alochistunaru..ala jaragakunda aa sodaruni convince chesi unte samaikhya vadam nilabadedi..

  13. ఒక తెలంగాణా బిడ్డగా, ఎందరో ఆంధ్రా ప్రాంత విద్యార్థి మిత్రులు మా సాంస్కృతిక వెనకబాటుతనాన్ని వెక్కిరించడం చూసినవాడిగా, ప్రభుత్వ వ్యవస్థలలో ఉన్న ఆంధ్రా అధికారుల దురహంకారాన్ని, ప్రాంతీయ దురభిమానాన్ని దగ్గరగా చూసిన వాడిగా, అన్నిటికీ మించి ఒక మానవతా వాదిగా 6 దశాబ్దాలుగా ఒక ప్రాంత ప్రజల పోరాటంలోని(వాదం ముసుగులో చేస్తున్న తుచ్ఛ రాజకీయాల సంగతి పక్కనపెట్టి) ఔన్నత్యాన్ని గుర్తించిన వాడిగా ఈ క్రింది విశ్లేషణ:
    1. అప్పుడు మద్రాసు నుండి ఆంధ్రులు విడిపోవడానికి దారి తీసిన పరిస్తితులే ఇప్పుడు తెలంగాణా వారికి ఆంధ్రా వారితో వున్నాయనేది వాస్తవం. అది ఎలా అంటే ఒకటి-మనలను తెలుగువారిగా ఒక ఐడెంటిటీయే లేకుండా మదరాసీలుగా పిలవడం & పరిపాలనా వ్యవహారాలలో తమిళుల ఏకచ్ఛత్రాధిపత్యం చేయడం.
    మరి మన ఘనతవహించిన ఆంధ్రా నాయకులూ, అధికారులూ చేస్తున్నదికూడా అదే కదా?
    2. కలిసి ఉన్నపుడు హైదరాబాద్ లో కేంద్రీకృతమైన అభివృద్ధి, ఉపాధి అవకాశాలను ఒదులుకోవడానికి సీమ, ఆంధ్రులు సిద్ధంగా లేరు అనేది కూడా ఆడలేక మద్దెల ఓడన్నట్లే అర్ధం చేసుకోవాలి. ఎందుకంటే ఇదే సిద్ధాంతం ఆనాడు మదరాసు నుండి మీరు విడిపోయిననాడూ వున్నా అన్నీ ఒదులుకోని ఎలా ఒచ్చారు? ఇంకో విషయం ఒక వ్యాపారి రేపు ఏమి జరుగుతుందో తెలియనప్పుడు పెట్టిన పెట్టుబడికి తగ్గ రాబడి వచ్చితీరుతుందని ఎవరైనా గ్యారంటీ ఇస్తేనే వ్యాపారం మొదలు పెట్టడు. అలాగే హైదరాబాద్ లో పెట్టబడ్డ పెట్టుబడులు/ జరిగిన అభివృద్ధికి సంబంధించిన ప్రతిఫలాలుకూడా ఇప్పటికి వారే ఎక్కువ అనుభవించారు మరియు ఆ కారణంగా ఇక్కడ వచ్చిన సెటిలర్స్, వారి పిల్లలు మూటా ముళ్ళే సర్ధుకొని వెళ్ళల్సిన పనిలేదనేది సహజ న్యాయ సూత్రం అయినప్పుడు ఇంకా దాని గురించేమాట్లాడడం అంటే చల్లకొచ్చి ముంత దాయడమే. అంటే హైదరాబాద్ పేరుతో కొర్రీ పెట్టి విభజన జరగకుండా అడ్డుకోని హైదరాబాద్‌పై(మొత్తం తెలంగాణా పై) పెత్తనాన్ని చెలాయించాలనే పేరాశ అయినాకావాలి, లేదా విడిపోయాక స్వంత రాజధానిని హైదరాబదుకు ధీటుగా ఏర్పరుచుకొని అభివృద్ధి చేసుకోగలమనే మనో ధైర్యం లేకపోవడమైనా కావాలి.
    3. పెద్దలందరూ హుందాగా వ్యవహరించి కేంద్ర నిర్ణయానికి అణుగుణంగా నడుచుకోకుండా అర్ధరాత్రి ప్రకటణ అని ఒకరు, ఎవరినీ సంప్రదించకుండా చేసిన తొందరపాటు ప్రకటణ అంటూ ఇంకొకడు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని బలవంతంగా సీమ, ఆంధ్ర ప్రజల మనస్సుల్లోకి బలవంతంగా ఇంజెక్ట్ చేసారనేది వారు ఒప్పుకున్నా, కోకపోయినా కాదనలేని వాస్తవం. వీరందరిదీ హైదరాబద్‌పై ఉన్న (దోపిడీ)కాంక్ష తప్ప నిజమైన సమైఖ్య కాంక్ష కాదు. అదే నిజమైతే తెలంగాణా ఉద్యమం ఉవ్వెత్తున లేచిన ప్రతిసారీ సమైఖ్య ఉద్యమమూ లేవాలి. అలా కాకుండా ప్రత్యేకాంధ్ర అని ఒకప్పుడు అనియున్నవాళ్ళూ, ప్రత్యేక/ గ్రేటర్ రాయలసీమ అన్నవాళ్ళూ సడన్‌గా ఒక్కటైపోయి ‘సమైఖ్యకు జై’ అనడం వెనుక వున్న నిజమైన సమైఖ్యత ఎంత?
    4. ఇక స్వంత రాజధానిని కట్టుకోవడానికి పట్టే నిధులగురించీ, టైం గురించీ మాట్లాడే వాళ్ళు ఆనాడు హైదరాబాదు కు వచ్చేనాడు అస్సెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్ట్ లాంటివన్నీ ఎక్కడినుంచైనా ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టారా, లేక మదరాసు నుండి కర్నూలుకు వచ్చిన నాడేమైనా రాజధాని నిర్మాణానికయ్యే డబ్బులు వాళ్ళనుండి అడుక్కొచ్చుకున్నారా? మరి ఆరోజు లేనివన్నీ ఈ రోజు ఎందుకు అడుగుతున్నట్లో.
    సరే అడిగారే అనుకుందాం. న్యాయమనిపిస్తే తీసుకోండి, మీరూ ఒక రాజధానిని, విజయవాడ లోనో లేక నిజంగా వెనకబడ్డ ఉత్తరాంధ్రపై ప్రేమ వుంటే వైజాగ్ లోనో పెట్టుకోండి. ఝార్ఖండ్ ను ఇచ్చేప్పుడు లల్లూ గారు కోరినట్లు వేల కోట్లో, లక్ష కోట్లో కోరుకోండి. కానీ, మా తెలంగాణా మాకిచ్చెయ్యండి . చాలు అని ప్రతి తెలంగాణా గుండెలోంచి వినపడుతున్న ఉద్యమ చప్పుళ్ళు ఇప్పటికైనా మీ చెవులకెక్కితే అంతా శుభమే అవుతుంది. కధ కంచికెళ్ళుతుంది. ఏమంటారు?

Leave a reply to Amar స్పందనను రద్దుచేయి