…ఓ పాఠకుడి స్టేట్ మెంట్… రెండవ భాగం

సాధారణం

ఈ టపా మొదటి భాగంలో రాసిన మాటల్లో రామోజీరావు వ్యాపార వ్యవహార సరళి గురించి ప్రస్తావించినప్పుడు ‘పచ్చళ్లు అమ్ముకోవడం’ అని రాసినందుకు పాఠక మిత్రులు బాధపడ్డారు. నిజమే. అది నా తప్పిదం. అలా రాసి పచ్చళ్లు అమ్ముకున్న వాళ్లను అవమానించడం డీఫాల్ట్ మిస్టేక్ గా జరిగింది. దానికి పచ్చళ్లతో సహా, పేపర్లు అమ్ముకుంటూ జీవిక పొందుతున్న నా దేశ సోదరులందరికీ క్షమాపణలను కోరుతున్నాను. అదేం చిత్రమో గాని, మా జిల్లాలో పచ్చళ్లు మా జిల్లావాసులెవరూ అమ్ముకోరు. ఖచ్చితంగా ఉభయ గోదావరి జిల్లాలనుంచే సైకిళ్లమీద వచ్చి అమ్ముకుంటారు. ఒకసారి నా మిత్రుడు ప్రసాద్ వీరిగురించే ప్రస్తావించారు. పచ్చళ్లు, మామిడి తాండ్ర, లేదంటే ఒక నలభై వేల రూపాయలు తెచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకునే కోస్తా బీద ప్రజల జీవనతెరువు గురించి చెప్పినప్పుడు నేను మూడొందలు సంవత్సరాల వెనక్కి చరిత్ర పేజీలు తిప్పవలసివచ్చింది — నిజానికి అదే కలొనియల్ రూల్ ఎస్టాబ్లిష్ చేసే విధానమని. ఇంగిలీషు దొరలకు ముందరే బుడతకీచులు, పోర్చుగీసులు, కిరస్తానీలు మనదేశానికి ఇలానే వచ్చారు. వ్యాపారం పేరుతో మొదలైన వ్యవహారం ఎక్కడిదాకా వెళ్లిందో మళ్లీ ఇక్కడ విడమరచక్కరలేదు.

నాలుగేళ్ల కిందట పొట్టచేత పట్టుకుని వచ్చిన ఏ కోస్తా సోదరుని పరిస్థితి అయినా శ్రీకాకుళమ్ జిల్లాలో వచ్చి చూడండి. వచ్చిన పని మొదటి సంవత్సరానికే మానుకుని, మరో పని, మరో పని మారుస్తూ నాలుగు రాళ్లు వెనక వేసుకోవడం గమనించవచ్చు. ఇంకా మరొక నమ్మలేని నిజం చెప్పమంటారా! శ్రీకాకుళం జిల్లాలో ఆపరేట్ చేస్తున్న మొత్తం మైక్రో ఫైనాన్స్ కంపెనీలన్నీ కోస్తా ప్రాంతపు సోదర వ్యాపారస్తులవే. ఇక్కడి గ్రానైట్ తరలించుకు పోతున్నమొత్తం ట్రాన్స్ పోర్ట్ వ్యాపారాలన్నీ కోస్తా జిల్లాల వ్యాపార సోదరులవే. ఇంకా ఈ మూడు జిల్లాలను ఆనుకునివున్న సముద్ర తీరప్రాంతపు మత్స్య సంపదనంతటినీ తరలించుకుపోతున్నదెవరో నేను చెప్పను. మీరెప్పుడైనా విశాఖపట్నం వచ్చినపుడు ఆర్ కె బీచ్ నుంచి భీమిలి వెళ్లే రోడ్డులో మీకూ సముద్రానికి మధ్యన కనిపించే సుమారు ఐదు వందల ఫిషరీస్ యూనిట్ల దగ్గర ఆగిఆగి దాని ఓనరెవరని అడిగి చూడండి. కనీసం ఒక్కటి అంటే ఒక్కటి ఈ మూడు జిల్లాలవారివి వుంటే వేరే వారిది వద్దు, నా చెప్పే తీసుకుని ఇలాంటి అర్థంపర్థం లేని విద్వేషపు మాటలాడి జనాన్ని చెడగొడుతున్న నా రెండు దవడలు వాయించేయండి. తన్నులు తినడానికి నేను సిద్ధం. నిజం చేదుగా వుంటుంది. కానీ అది నిజమని మర్చిపోకూడదు.

ఇట్లా బతుకుతెరువుకోసం వలసవచ్చిన వారు వచ్చినట్టు ఊరుకోకుండా వారు ‘ఒక రకమైన’ భావజాలాన్ని అక్కడి ప్రజలమీద రుద్దుతారు. అమెరికాలో రెడ్ ఇండియన్లపైన దారుణాలకు తెగబడినవారూ, ఆస్ట్రేలియా అబారిజన్ల గొంతుపైన కూర్చున్నవారూ, ఆఫ్రికాలో నీగ్రోలను దోచుకున్నవారూ, మనదేశంలో ద్రావిడులమీద దండెత్తిన ఆర్యులూ, నిన్నకాక మొన్న మనల్ని నిలువుదోపిడీ చేసిన బ్రిటిషువాడూ…ప్రదేశాలు వేరైనా పద్ధతి ఒకటే….విధానం ఎక్కడైనా కథనం ఒక్కటే…. వలసవాద ఆధిక్యతా భావనతో “నువ్వు సంస్కారం తెలియని అనాగరికుడివి. నేను నిన్ను ఉద్ధరిస్తున్నాను తెలుసా!” అనే భావన వారి నరనరాల్లో జీర్ణించుకుపోయుంటుంది. అది అక్కడి ప్రజలమీద రుద్దితే.. రుద్దితే.. రుద్దితే అక్కడ సీన్ కట్ చేసి ఇప్పటి మనల్ని చూసుకుంటే మనమెలా తయారయ్యామో తెలుస్తుంది. శ్రీకాకుళంలో ‘ఏమిటి’ అన్న పదం వాడం. ‘ఏటి’ అన్న పదమే వాడుతాం. పీజీలు చదువుకున్న మిత్రులు కూడా చిన్నపిల్లలు ఏటిరా అంటే అది తప్పని ఏంటిరా అని పలకమని జ్ఞానబోధ చేస్తుంటారు. అన్నట్టు ఈ ఏమిటి పదం శిష్టజన వ్యవహారం ఎలా అయింది? మళ్లీ మనం ఫ్రెంచ్ భాషా తత్వవేత్త ఫెర్డినాండ్ ససూరే మాటల్ని గుర్తు తెచ్చుకోవాలి.

ఒక భాషలో వివిధ మాండలికాల్లో బాగా నాగరకత ప్రబలిన ప్రాంతపు మాండలికంగాని, రాజకీయంగా ఆధిక్యతను పొందిన ప్రాంతపు మాండలికంగాని ప్రమాణ భాషగా ఆ భాషాప్రదేశమంతా చెలామణి అవుతుంది.”

భాష విషయంలో, ఆహారం విషయంలో, ఆహార్యం విషయంలో అందరికీ మన రాష్ట్రంలో ఒక భౌగోళిక ప్రాంతంవారే ఆదర్శం కావడం విడ్డూరం వరకే అయితే విచారించక్కర్లేక పోయేది. కానీ మిగిలిన భౌగోళిక ప్రాంతాలయిన తెలంగాణ, రాయలసీమ, కళింగాంధ్ర ప్రాంతాల వాడుకలు తక్కువ రకమైనవనే న్యూనత కోస్తా ప్రాంతవాసుల్లోనే కాక రాష్ట్రమంతటా రాజ్యమేలడానికి కారణాలు తేల్చడం ఎవరి వల్ల సాధ్యం! అందులోనూ ప్రస్తుతం ఎమోషనల్ గా బాగా డిస్టర్బ్ గా వున్నాం కూడా.

కాస్తా మన ఆవేశకావేశాలను కాసేపు పక్కనపెడదాం. అందుకని మన దేశంలోనో… మన రాష్ట్రంలోనో అంటే … మన అహాలు మనకు అడ్డువస్తాయి. అందుచేత పేర్లు మార్చి మాట్లాడుకుందాం. ఒక దేశంలో నాలుగు రాష్ట్రాలున్నాయి. ఒక రాష్ట్రంలో దగ్గర దగ్గర తొమ్మిది నదులు పారుతున్నాయి. మరో రాష్ట్రంలో దగ్గరదగ్గర పంతొమ్మిది నదులు పారుతున్నాయి. మొదటి రాష్ట్రం ఈరోజో రేపో ఎడారిగా మారనుండగా, రెండో రాష్ట్రంలో పంటలు పండక ప్రజలంతా వలసలు పోయి నిర్మానుష్యంగా తయారవుతోంది. మూడో రాష్ట్రం గుండా పారుతున్న నాలుగు చిన్నాపెద్దా నదులు నాలుగో రాష్ట్రం గుండా వెళ్లి సముద్రంలో కలిసిపోతున్నాయి. అయితే ఈ భూప్రపంచం మీద నరమానవుడికి అర్థంకాని సంగతి ఏమిటంటే నదినీరు మూడో రాష్ట్రంగుండా పారుతున్నా అక్కడి ప్రజలకు పంటలు పండకో, పండించడం చేతకాకో గత ఆరు దశాబ్దాలుగా దరిద్రులుగా మిగిలిపోతుంటే, నాలుగో ప్రాంతం మాత్రం దేశంలోనే సంపన్నమైన ప్రాంతం కావడం. ఇది ఆఫ్రికాలోనో అరేబియాలోనో జరిగిందనుకుని తీర్పులు చెప్పండి సభ్యసామాజికుల్లారా!

నీరు నిలుపుకొని పంట పండించకపోవడం వారి చేతకానితనమనుకుని వారి మానాన వారిని వదిలేద్దామా? గడసరిగా నీరు వాడుకుంటున్న వీరి తెలివితేటల్ని చూసి ఉప్పొంగిపోదామా? ముందే చెప్పినట్టు, మొదటి, రెండు ప్రాంతాల ప్రజలకు అక్కడి నుంచి నీరే కాదు, గాలి కూడా రాదు. ఇది దోపిడీ చేస్తున్నవారికీ దోపిడీ కాబడుతున్నవారికీ మధ్య జరుగుతున్న రగడ. నువ్వూ నేనూ చేయాల్సింది ఒకటి — వారికి రెండు మూడు రెట్లు నదీప్రవాహాలున్నా ఎందుకిలా పంటలు పండక డొక్కలు మాడుతున్నాయని ఆలోచించడం. రెండు — న్యాయం వైపు నిలబడడం. అంతేగాని, ఎవడో వాయిస్తున్న నాదస్వరాలకు తలలూపడం కాదు. మన మనసులు ఇవ్వాళ కండిషన్డ్ అయిపోయాయి. అసలు మన మాటల్లోనే అది బోధపడుతుంది. నీ తిండిని ఎగతాళి చేసేవాడిని, నీ బట్టను ఎగతాళి చేసేవాడిని, నీ భాషను ఎగతాళి చేసేవాడిని, నీ పద్ధతులను ఎగతాళి చేసేవాడిని నీతో కలిపేసుకుని మురిసిపోతుంటే… నాకు గుంటూరు శేషేంద్రశర్మ మాటలే గుర్తుకొస్తున్నాయి. “ఒరేయ్, రూపాయి నలిపి వాసన చూపిస్తేనే అలా మూర్ఛపోతే ఎలారా!”

ఈ కండిషనింగ్ ఆరు దశాబ్దాల్లోనే ఎలా సాధ్యమైందని మరీ ఆశ్చర్యపోకండి. మినహాయింపులు లేకుండా మనకున్న తెలుగు దినపత్రికలన్నీ ఎవరివి? టీవీ ఛానెళ్లన్నీ ఎవరివి? మిగిలిన వార, మాస, సాహిత్య పత్రికలన్నీ ఎవరివి? మన సినిమా దర్శకులు ఏ ప్రాంతంవారు? నిర్మాతలు ఏ ప్రాంతంవారు? అగ్ర నటులు, రచయితలు, ఇతల విభాగాల నిపుణులు ఏ ప్రాంతం వారు? అందుకే ప్రజాకవి కాళోజీ ఇలా అంటారు: “కళారాధకులు ఒకచోట – కళాపోషణమొకచోట, వాసననూనెలొక చోట – మాసిన తలలింకొకచోట” అని. కండిషనింగ్ అవ్వదంటే అవ్వదా మరి. అసలు పత్రికలు, టీవీలు, సినిమాలు మనుషుల భావజాలాన్ని కండిషనింగ్ చేయగలవా అనుకునే అమాయకులంతా తాజా తెలుగు రాజకీయ చరిత్రలో ఈనాడు దినపత్రిక ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు ఎలాంటి ఫ్రిక్షన్ లేకుందా అధికార మార్పిడి జరపడంలో విజయం పొందడమూ, అదే పత్రిక వైఎస్ ను మొన్నటి ఎన్నికల్లో పరాజయం పాలవ్వాలని చెమ్చాలతో కాకుండా కడవలతో పాఠకుల బుర్రల్లో విషాన్ని పోసి తానే పరాజయం పాలవ్వడం ప్రత్యక్షంగా చూసిందే. సాహిత్య ఉదాహరణలివ్వాలంటే జార్జి ఆర్వెల్ తన “1984” నవలలో ఈ ప్రక్రియ గురించి విపులంగానూ వర్ణించడం చూడొచ్చు.

నీళ్ల సంగతి ఒక్కటి రాసి దోపిడీ అంటే ఎవరికైనా కోపం వస్తుంది. రాష్ట్రంలోనే కాక దేశంలోకూడా చాలా థర్మల్ పవర్ ష్టేషన్లకు బొగ్గును సరఫరా చేసే తెలంగాణ మాత్రం తాను చీకట్లోనే ఎందుకు మగ్గాల్సివస్తోంది. దీని గురించి కోస్తావాళ్లను ఏమీ అనడానికి లేదు. మన పాలకుల మరగుజ్జు మనస్తత్వం వల్ల జరుగుతున్న అనేకానేక తతంగాలలో ఇదొకటి. రాష్ట్రప్రభుత్వానికి వచ్చే హైదారాబాదేతర తెలంగాణ ప్రాంతానిది అధిక వాటా అయినప్పటికీ తిరిగి వాటాల పంపిణీలో ఎవరికి దక్కుతుంది ఎంతెంతో తేల్చేముందర రాయలసీమ, కళింగాంధ్ర ప్రజలు ఆ లెక్కల జోలికి పోకపోవడమే మంచిది – కనీసం మనసన్నా ప్రశాంతంగా వుంటుంది. ఒక్కటే గుర్తుంచుకోవాలి. ఆ రోజు మద్రాసు నుంచి ప్రత్యేక రాష్ట్రంగా విడిపోవడానికి ఏయే కారణాలు మూడుకోట్ల ఆంధ్రులు చెప్పారో, ఈ రోజు అవే డిమాండ్లతో నాలుగుకోట్ల మంది తెలంగాణ ప్రజలు స్వపరిపాలన కోసం నినదిస్తున్నారు.

…ఇంకా వుంది

ప్రకటనలు

13 responses »

 1. వుహ్…మీరు మారారు. ఎవరూ తెలంగాణ భాషను తక్కువ చెయ్యరు. మీకు మీరే చేసుకుంటున్నారు. రామోజీరావు ఒక గొప్ప పారిశ్రామికవేత్త. అంత చిన్న పొజిషన్ నుంచి ఇవ్వాళ ఇంతలా వున్నాడు అంటే… అవినీతి వుంటుంది.. లేదు అనట్లేదు..కాని, తెలంగాణలో అందరూ నిజాయితీపరులా ఏంటి?రామోజీరావు ఎప్పుడూ తెలంగాణ వాళ్లను వెక్కిరించటం.. తక్కువచెయ్యటం చెయ్యలేదు. చేశాడు అని మీరు నిరూపించండి చూద్దాం..

 2. ఇది ఇప్పటికి బయటికి బచ్చింది కడుపులో కుళ్ళు . నిన్న గాక మొన్న సొమ్ములు పోనాయండి ఏటి సేయమంటారు అని పందికుక్కు లాగ బొక్కి మళ్ళి ఎన్నికల్లో ఒకే కుటుంబం నుంచి నలుగురు గెలిచినా ఘనత వహించిన కుటుంబానిది ఏ జిల్లా ? ఎసి లేనిదే బయటికి రాని రాజు గారిది ఏ జిల్లా ? హైదరాబాద్ తరవాత సకల సౌకర్యాలతో కులుకుతూ హైదరాబాద్ తెలంగాణా వాళ్ళు తీసుకుంటే మాకేమి అని సంబరపడుతున్న విశాఖపట్నం ఈ మూడు జిల్లాలో లేదు కదూ ?
  అదేం చిత్రమో గాని, మా జిల్లాలో పచ్చళ్లు మా జిల్లావాసులెవరూ అమ్ముకోరు. ఖచ్చితంగా ఉభయ గోదావరి జిల్లాలనుంచే సైకిళ్లమీద వచ్చి అమ్ముకుంటారు. ఒకసారి నా మిత్రుడు ప్రసాద్ వీరిగురించే ప్రస్తావించారు. పచ్చళ్లు, మామిడి తాండ్ర, లేదంటే ఒక నలభై వేల రూపాయలు తెచ్చి ఇక్కడ వ్యాపారం >> అబ్బ మన తోటి వారు వాళ్ళ వృత్తులు అంటే మీకెంత ప్రేమ .
  ఇక్కడి గ్రానైట్ తరలించుకు పోతున్నమొత్తం ట్రాన్స్ పోర్ట్ వ్యాపారాలన్నీ కోస్తా జిల్లాల వ్యాపార సోదరులవే. ఇంకా ఈ మూడు జిల్లాలను ఆనుకునివున్న సముద్ర తీరప్రాంతపు మత్స్య సంపదనంతటినీ తరలించుకుపోతున్నదెవరో నేను చెప్పను>> అలాగా మరి ఢిల్లీ , హైదరాబాద్ బడా విమానాశ్రయాలు నడుపుతున్న బడా పారిశ్రామిక వేత్త ఏ ప్రాంతానికి చెందిన వాడో తమరికి తెలియదా ?
  ఏటి’ అన్న పదమే వాడుతాం. పీజీలు చదువుకున్న మిత్రులు కూడా చిన్నపిల్లలు ఏటిరా అంటే అది తప్పని ఏంటిరా అని పలకమని జ్ఞానబోధ >> ఇంత తెలిసిన తమకు తమ సోదర ప్రాంత జిల్లా వాసులు కు కూడా వారి కి చెందిన యాస ఉన్నదని మాత్రం తెలవదు .
  నీళ్ల సంగతి ఒక్కటి రాసి దోపిడీ అంటే ఎవరికైనా కోపం వస్తుంది. రాష్ట్రంలోనే కాక దేశంలోకూడా చాలా థర్మల్ పవర్ ష్టేషన్లకు బొగ్గును సరఫరా చేసే తెలంగాణ మాత్రం తాను చీకట్లోనే ఎందుకు మగ్గాల్సివస్తోంది >> అలాగా ఒక్క తెలంగాణా ప్రాంతానికి పవర్ కట్ ఉందా మిగిలిన వారికి 24 గంటలు కరెంట్ ఉందా ? కొస్తా ప్రాంత పల్లెలు తమరేప్పడున్నచూసారా ?

 3. >>>>>
  అలాగా మరి ఢిల్లీ , హైదరాబాద్ బడా విమానాశ్రయాలు నడుపుతున్న బడా పారిశ్రామిక వేత్త ఏ ప్రాంతానికి చెందిన వాడో తమరికి తెలియదా ?
  >>>>>
  శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కట్టిన గ్రంథి గోదావరి ప్రాంతంవాడే. అతను మొదట శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం దగ్గర ఫాక్టరీ కొన్నాడు. తరువాత రాజాంలో జనుప మిల్లు, సిమెంట్ ఫాక్టరీ కట్టాడు. అతను బెంగళూరు వెళ్ళిపోయి, కొత్త వ్యాపారాలు పెట్టుకుని, అతని తమ్ముడికి రాజాంలోని ఫాక్టరీలు అప్పగించాడు.

 4. మీరు చెప్పింది అక్షరాల నిజమండి ..
  సిక్కోలు శ్రీకాకుళంగా మారినా ….ఇంకా సీకకులం గానే పిలుస్తున్నారు .
  ఎంతమంది మంత్రివర్యులున్నా ..
  ఇంకా వెనుకబడే వుంది …
  ఇంక యాస అంటారా …
  గిడుగు రామమూర్తి పంతులు ,గురజాడ ఎంత గ్రాంధికం ,వ్యావహారికం నేర్పినా యాస మన ప్రాంతానికి సంబంధించినది.అక్కడి ప్రజల మనోభావాలకు సంభందించినది .అందరితో పాటు మాట కలపడమే సరయిన ప్రక్రియ. అప్పుడే సమాజానికి దగ్గరకాగలం ..
  ఎవరో ఏదో అనుకుంటారని ,హేళన చేస్తారని మన యాసను ,మాండలికాన్ని వదిలేస్తే భవిష్య తరాలకు మన సంస్కృతి గురించి చెప్పే నాథుడే ఉండడు.
  పుస్తకాల్లోనో ,లోనో చూసి నేర్చుకోవాలి .

 5. Mr. Praveen I am asking the author of this blog, don’t interfer in between and tell something shit like kcr belongs to VZM, and Grandi belongs to Godavari . Why you people are silent when GMR is doing development through GMR Varalaxmi trust ? What happend to you voices then. I am not expecting any response from you further and I respond to your comments also.

 6. అయ్యా పాఠకుడు గారు,
  మీ విషయ పరిజ్ఞానం అమోఘం. విశ్లేషణ అద్భుతం. నిన్నటివరకు ఎవరు ఏ ప్రాంతం వారు అని నేను చూడలేదు. అందరికీ సమాన అవకాశాలు కల్పించాను. మీరు చెప్పిన దాని ప్రకారం “ఏమీ లేని ఒక ఆంధ్ర ప్రాంత వ్యక్తి వేరే చోటకి వెళ్లి అతని జీవితం పచ్చళ్ళతో ఆరంభించి ఇప్పుడు కోటానుకోట్లను ఆర్జించాడు అంటే అతని సంకల్పానికి నేను చేతులెత్తి మొక్కుతాను”. మరియు నాకు అటువంటి వ్యక్తి నాకు ఆదర్శం. జీవితంలో ఎవరైనా ఎదగాలనే కోరుకుంటారు. అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడాలని జనాలు ఎందుకు కోరుకుంటారో నాకిప్పుడు అవగతమైంది.

  ధన్యవాదాలు

 7. అయ్యా ప్రవీణ్ శర్మ గీడ మా ఏడుపు కూడా అదే పచ్చడి బాగుంటే కొనుక్కొని తిను లేకపోతే అవతల కొనడం మానెయ్యి , పేపర్ నచ్చితే కొని చదువు ళేడా మానెయ్యి . దానికి కోస్తా వాడా, రాయలసీమ వాడా , లెకపోతే తెలంగాణా వాడా అన్న ఏడుపు ఎందుకు ? దీనికి కులపిచ్చి కి పెద్ద తేడాలేదు .

 8. annai nee midi midi gnanam to rase ee articles choostunte navvu vastundi naku.

  “మనదేశంలో ద్రావిడులమీద దండెత్తిన ఆర్యులూ”

  Aryan invasion theory oka bootakamani chala mandi chepparu.Idi oka controversial topic mariyu etuvanti rujuvulu levu ani sanketiak parignanam chebutundi.

  http://www.stephen-knapp.com/death_of_the_aryan_invasion_theory.htm
  http://timesofindia.indiatimes.com/city/varanasi/Indian-scientist-set-to-change-world-history/articleshow/5301655.cms

  “ప్రపంచం మీద నరమానవుడికి అర్థంకాని సంగతి ఏమిటంటే నదినీరు మూడో రాష్ట్రంగుండా పారుతున్నా అక్కడి ప్రజలకు పంటలు పండకో, పండించడం చేతకాకో గత ఆరు దశాబ్దాలుగా దరిద్రులుగా మిగిలిపోతుంటే, నాలుగో ప్రాంతం మాత్రం దేశంలోనే సంపన్నమైన ప్రాంతం కావడం”

  This fact has been debunked to the core.Telangana region is at a height of 1000ft on avg throughout the catchment area.Whereas andhra at 100 ft and rayalaseema at 700ft.
  Hence even nizam couldnt build any dams even while british where doing it Andhra region because there is neither “lift irrigation technology” available in those days nor the energy resources required to do it.

  According to some estimates it costs 10k -20k rs/acre (have no proof for this now) for providing water through these schemes.I dont think even there is abled technology for such projects in the years 1940-1990 nor the finacial resources with the state govt.But I see lot such projects being taken up in the last decade or so (you can contradict me here).My drawing from these facts is that there was nothing intentional about the share of water resources and every thing is “path dependent”.

  But I agree to the fact there is some cultural hegemony or imperialism by 2-3 districts over the entire Andhra prades ( Krishna, guntur,Eluru).An interesting fact here is the present day modern language is derived from “Bammera potana ” who ironically belongs to Warangal.And this was built upon by Gurazada apparao , veerasalingam pantulu and others…A brief look at history shows that at any given point there will be only one major culture/language more popularized.Be it English now, decades ago Urdu earlier and Greek and Roman few centuries ago.Also you should realize that culture is “Dynamic” not “static”.Things change and we have to change with it.

  Meeru cheppe neellu, sampada dopidi nizame aite, Telangana anedi nyayam,dharmabaddamina korika, akanksha.Kani ee dopidi anedi nizam kakapote ippativaraku telangana medavulu andaru cheppindi bootakam matale…Oka analysis cheyadaniki facts teliyali, ante kane analysis chesesi facts puttincha koodadu.

 9. రామోజీరావు గురించి రాస్తే అంత కోపం దేనికి? ఒక మనిషి జీవితకాలంలో చేయలేనన్ని పనులు చేసే అవకాశం చేజిక్కించుకొని పాలకవర్గాలను శాసించే స్థితికి చేరాడు. మార్గదర్శి కుంభకోణం సత్యం కుంభకోణంకంటే ముందువచ్చిన అతి పెద్ద దోపిడీ గుర్తు. కానీ అవకాశవాద న్యాయవ్యవస్థ లోని లోపాలద్వారా బయట తిరగగలుగుతున్నాడు. పేపర్ వుండబట్టే అది కూడా సాధ్యమయింది. పాపం రామలింగరాజుకు ఆ అవకాశం స్వంతమీడియా లేకపోవడంతో దొరకలేదు.

  ఉత్తరాంధ్ర వెనకబాటుతనానికి పాలకవర్గాల నిర్లక్ష్యం కారణం. జీవనదులకు తీసిపోని వశధార, నాగావళి వున్నా సరిఅన్ నీటి పారుదలసదుపాయాలు కల్పింపబడక ఇలా ఏడుస్తున్నాం. అలాగే రాష్ట్రంలో ఎక్కడా చోటులేనట్లు ఇక్కడే అణువిద్యుత్ కేంద్రం, ఏడు ధర్మల్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుతో ఆ వున్నపాటి నీటిని కూడా కలుషితం చేసి, ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చే కుట్ర చెస్తున్నారు. వారెక్కడివారో అందరికీ తెలుసు. కలహండి నుండి మా మూడు జిల్లాల వారు పొట్టచేతపట్టుకొని పయనమయ్యేది ఎక్కడికో తెలియనిది కాదు. మరి ఈ పేదరికం, ఈ నికృష్టపు బతుకు ఎవరి శాపం?

  ఒక గ్రంధినో, ఒక రాజునొ, ఒక బొత్సనో చూపించి మీరంత భాగ్యరేఖ దాటిపోయారంటారా? మొదటివాడు ఆనవాలక్కడదే. మా అంబలి నాకే మూతులను చూసి మీకు వెటకారం ఎక్కువ కాకపోతే ఆయన శంషాబాద్ విమానాశ్రయం నిర్మిస్తే అది మాకు వాటా యిచ్చాడా? గానుగలో గంటేడు విదిలించే ట్రస్టుల వలన ఎవడికి ఉపయోగం. దాంతో రేప్పొద్దున్న ఏ రామన్ మేగసేసో, నోబెల్ శాంతి బహుమతో కొట్టేసినా కొట్టేయొచ్చు. పెట్టుబడిదారుడు ఎవడైనా సమాజానికి జలగలాంటివాడే.
  ఎవడిబతుకు వాడు బతుకుతానంటే విశాలమైన ప్రాంతంలో, బలమైన సైనికాధికారాలతో పెట్టుబడులు పెట్టే అవకాశాలు కోల్పోతామన్న భయంతో ఈ సమైక్య ఉద్యమాలు తోలబడుతున్నాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s