…ఓ పాఠకుడి స్టేట్ మెంట్… మూడో భాగం

సాధారణం

ఒక తండ్రికి నలుగురు కొడుకులున్నారు. ఒక కొడుకు బి. టెక్ పూర్తిచేశాడు. ఎం. టెక్ చదువుతున్నాడు. ఆ తరువాత పీహెచ్ డి చేస్తాడు. ఆపైన పోస్ట్ డాక్టరల్ రిసెర్చ్ చేస్తాడు. ఆ తరువాత స్వయంగా రిసెర్చ్ చేసి ఏదైనా ఒక ప్రత్యేకమైన వస్తువు కనిపెట్టాలని కోరిక. ఆ పై ప్రభుత్వం ఇచ్చే అవార్డు సొమ్ము అంతా తన కుటుంబానికే ‘అంకితం’ చేసేస్తాడు. రెండో కొడుకు పెద్దగా చదువుకోలేదు అయినా రెక్కలు ముక్కలు చేసుకుని ఇంటికి సరిపడా డబ్బులు సంపాదిస్తున్నాడు. మూడో, నాలుగో కొడుకుల సంగతి చెప్పనే అక్కరలేదు. అయ్యకు విద్యాలేదు, గర్వమూ లేదు అన్నట్టుగా చదువూ అరకొరే, సంపాదనా అరకొరే. నలుగురూ తెచ్చిన సంపాదనను తండ్రి ఎలా మేనేజ్ చేస్తాడని మీరు భావిస్తారు? కానీ ఆ ‘అదో రకమైన తండ్రి’ మాత్రం సంపాదనలో సగానికిపైన ఇంజనీరింగ్ చదువుతున్న కొడుకు కోసం కేటాయించి, మిగిలిన సొమ్ములు మిగిలిన వారికి అడ్డదిడ్డంగా పంచుతున్నాడు. అలా కొన్నాళ్లు బాగానే సాగింది. కానీ కోడళ్లు, పిల్లలు పెరిగాక, జరుగుతున్న మతలబును అందరూ గుర్తించారు. ఆ ఇంటిలో అప్పుడేమి జరుగుతుందని, జరగాలని మీరు తీర్పులు చెప్తారు మిత్రులారా…! మీ సమాధానాలు మీ మనసులోనే వుంచుకోండి. గానీ ఆ కుటుంబంలో ఏం జరిగిందో నేను చెప్తాను. అలాంటి దగ్గర ఏంచెయ్యాలో మీరు చెప్పుదురు గాని…

కుటుంబాన్ని సమావేశపరిచిన రెండో కొడుకు వేర్పాటు గురించి ప్రస్తావించాడు. మొదటి కొడుకు ఉగ్రతాండవం చేశాడు. నిప్పులు కక్కాడు. చిందులు తొక్కాడు. వేరేగా విడిపోవడం వల్ల విడిగా అద్దె, విడిగా కరెంటు బిల్లు, విడిగా గ్యాస్ అన్నీ అనసరంగా ఖర్చులు పెరుగుతాయన్నాడు. కలిసివుంటే కలదు సుఖం అన్నాడు. ఇంటికి నేనెంత పేరు తెస్తున్నానో కదా అని చెమట తుడుచుకున్నాడు. ఇంటిని ఉన్నపళంగా ముక్కలుచేస్తే చిన్నపిల్లల లేతమనసులు ఎంత చివుక్కుమంటాయో అని విలవిల్లాడాడు. తాతలనుంచి వస్తున్న పట్టెమంచం ఎవరిదగ్గర వుంచాలో కదా అని కడివెడు కన్నీరు కార్చాడు. ఇంట్లో ఆడవారు, పిల్లలు ముందు అంతా ఒకరి మొహాలుచూసి ఒకరు తప్పుకునేవారు. ఆ తర్వాత మాట్లాడుకోవడం మానేశారు. ఇప్పుడు కనిపిస్తే తిట్టుకుంటున్నారు. పిల్లలు ఒకరిపై ఒకరు చేతులెత్తుకుంటున్నారు. ఇలాకాదని చెప్పి బంధువులను, ఊరి పెద్దలను పిలిపించారు. పెద్దమనిషి రాత్రి పదకొండుకు వచ్చి దీనిగురించి తప్పక సానుకూలంగా ఆలోచిద్దామని చెప్పగానే మొదటి కొడుకు కస్సుమన్నాడు. అర్థరాత్రి రావడమేమిటన్నాడు. అన్ని తక్కువ మాటలు మాట్లాడడమేమిటి అన్నాడు. మూడోవాడిని, నాలుగో వాడిని ప్రభావితం చేయబోయాడు. ఆర్. కె. నారాయణ్ రాసిన “ది గైడ్” నవలలో జాఫర్ తో కథానాయకుడు రాజు అన్నట్టు “ఏం జరుగుతుందో తెలుసుకునేలోపునే అన్నీ జరిగిపోతున్నాయి” అని వారిద్దరూ వాపోతున్నారు. ఒకవైపు కలిసివుండడంలో మజాగురించి, విడిపోతే ఎప్పుడైనా జ్వరమో తలనొప్పో వస్తే జరిగే తీవ్ర ప్రమాదాల గురించి చాలా ఎమోషనల్ గా మాట్లాడడంతో వారిద్దరూ బిత్తర చూపులు చూస్తున్నారు.

నా బోడి తెలివితేటలకు మీకు నవ్వు వస్తోంది కదూ! నా కథ మీకు కోపం తెప్పించింది కదూ! ఇప్పటివరకూ తెలంగాణ ప్రాంత మేధావులు కొన్ని లక్షల సభలు సమావేశాలు నిర్వహించారు. కొన్ని వేల కరపత్రాలు పంపిణీ చేశారు. కొన్ని వందల పుస్తకాలు ఈ విషయమై ప్రచురించారు. అవన్నీ చదివి అర్థం చేసుకున్న తెలంగాణ ప్రజలు వారికి ఏం కావాలో స్పష్టంగానే వున్నారు. కానీ అప్పుడే నిద్రలేచిన మిగతా రాష్ట్రం ప్రజలలో ఒకరికి మరొకరం ఇలా, ఇంకోలా, మరోలా మొత్తానికి ఏదోలా ప్రతి ఒక్కరికీ ఇప్పుడు మనం మొత్తం కథంతా చెప్పాల్సివస్తోంది. అక్కడి ప్రజలెంత పట్టుదలగా వున్నారో మొన్న యూనివర్శిటీలో విద్యార్థుల సదస్సు తేల్చిచెప్పింది. ఒకవైపు ప్రభుత్వపు ఉక్కుపాదం, మరోవైపు పోలీసుల దమనకాండ, ఇంకోవైపు కొందరు మేధావుల కుట్రపూరిత దుశ్చర్యలు (నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా) వీటన్నింటిని తట్టుకుని, నిలదొక్కుకుని లక్షలాది మంది విద్యార్థులు అంత ప్రశాంతంగా సదస్సు నిర్వహించడం బహుశా సమకాలీన చరిత్రలో అరుదైన, అపురూపమైన సంగతి. ఇప్పుడు మనందరిమీదా వున్న ఏకైక బాధ్యత ఒక్కటే. మీరెటువైపు? దోపిడీదారుల వైపా? దోపిడీకి గురవుతున్న వారివైపా? ఈ ప్రశ్న ఒక్కటే మనకుమనం చాలా సీరియస్ గా ప్రశ్నించుకోవలసిన విషయం.

దాంతోపాటు మనమంతా ఆలోచించాల్సి తీరాల్సిన మరో విషయం -అసలెందుకిలా జరుగుతోంది అని?

ఇంగ్లండు పక్కనే వున్న ఐర్లండులో ఇలాంటిదే పోరాటం జరిగితే దాన్ని ఐరిష్ జాతీయోద్యమం అని పిలుస్తున్నాం. శ్రీలంకలో తమిళ సోదరులు తమ అత్మాభిమానాన్ని వ్యక్తపరుస్తూ జరుపుతున్న పోరాటానికి తమిళ జాతీయోద్యమం అని పిలుస్తున్నాం. నెదర్లాండ్స్ లో ఇదే రకమైన పోరాటం జరిగిందని ఎక్కడో విన్నాను. ఎక్కడైనా దానిని జాతీయోద్యమమని పిలిచి మన భారతదేశంలో మాత్రమే ఛత్తీస్ ఘడ్ కోసమో, విదర్భ కోసమో, జార్ఖండ్ కోసమో, బోడోలాండ్ కోసమో జరుపుతున్న అదే తరహా దోపిడీ వ్యతిరేక, వివక్షకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలను ప్రాంతీయ ఉద్యమాలని ఎందుకు పిలుస్తున్నాం? సుత్తిలేకుందా సూటిగా నిజం చెప్పనా… నిజంగా మనకు దేశభక్తి ఎక్కువ కాబట్టి.

ఈ రోజు తెలంగాణతో ఈ గొడవ సద్దుమణగదని, రేపు మరో ప్రత్యేక కరీంనగర్ కోసం పోరాటం తప్పదని గగ్గోలు పెడుతున్న ముందుచూపు మేధావులకు ఒకటే విజ్ఞప్తి. ఈ రోజు కార్యాన్ని కాదు, ఇందుకు గల కారణాలను విశ్లేషించండి (వెనక్కి చూడండి) అని మనవి చేసుకుంటున్నాను. ఇవే కారణాలతో ఇలాంటివి మరో మూడొందలు ఉద్యమాలు వచ్చినా వాటిని మనం స్వాగతించాల్సిందే. దోపిడీ వున్నంతవరకూ దోపిడీదారులను ఎదిరించాల్సిందే. వారికి వ్యతిరేకంగా నడుం బిగించాల్సిందే. వివక్ష వుంటే అది రూపుమాసేవరకూ పోరు సలపాల్సిందే.

మా జిల్లాలో నేను తిరుగాడేచోట తెలంగాణ ఉద్యమం గురించి వ్యతిరేకంగా మాట్లాడేవారినల్లా వారి కాళ్లూగడ్డాలూ పట్టుకుని బతిమాలేది ఒక్కటే. ఒరే ముందు మీ ముడ్డి తడుముకోండర్రా అని. అక్కడకు నీళ్లొచ్చి ఎప్పుడో నీ పంచె తడిసిపోయింది. అది చూసుకోకుండా అనవసరమైన వాగుడు నువ్వు వాగకురా నాయనా ఎర్రి నా మొగమా అని వేడుకుంటున్నాను. ఈ దేశంలోగాని, ఈ రాష్ట్రంలోగాని అత్యంత వెనకబడిన ప్రాంతమేదని ఎవరిని అడిగినా టక్కున శ్రీకాకుళం అని చెప్తారు. దేశంలో ఒక ప్రాంతం వెనకబాటుకు కారణం ఎవరెన్ని మాటలు చెప్పినా అది పాలకులు ప్రజలకిచ్చిన శాపమే గాని,ఆక్కడి ప్రజల పాపం ఏనాటికీ కాదు. మన వెనకబాటుకు కారణమేమిటి? పిగ్మీలకంటే కురచనైన మన రాజకీయ నాయకుల మనస్తత్వమే ఇందుకు కారణం. ఇందులో మినహాయింపులు లేవు. అందరు రాజకీయ నాయకులు ఇలానే ప్రవర్తించడం వల్ల ఒక ప్రాంతం సుభిక్షంగా, మరో ప్రాంతం దుర్భింక్షంగా రూపొందుతున్నాయి. వనరుల లభ్యత, మానవ వనరుల లభ్యత ఇవన్నీఒట్టి పోచికోలు కబుర్లు.

తెలంగాణ ప్రాంతంలో గడచిన ఆరు దశాబ్దాలుగా అక్కడి మేధావులు, నాయకులు, ఉద్యమకారులు, చరిత్రకారులు, రచయితలు, ఆలోచనాపరులు సాగించిన మహత్తర కృషి రాయలసీమ, కళింగాంధ్ర ప్రాంతాలలో జరగాలి. ఎలా వుండేవాళ్లం, ఇప్పుడెలా వున్నాం? ఎందుకిలా తయారయ్యాం? ఈ నేల ఎవరిది? స్వతంత్రం వచ్చిన ఈ అరవై ఏళ్లలో మనమెంత ప్రగతి సాధించాం? పొరుగున ప్రాంతాలు ఎంత ప్రగతి సాధించాయి? ఈ తేడాలకు కారణమేమిటి? రాష్ట్ర ఆదాయానికి మన చేర్పు ఎంత? తరిగి పంపిణీ అవుతున్న రెవెన్యూలో మనవాటా ఎంత? ఇలాంటివి వందలాది ప్రశ్నలకు మనం జవాబులు రాబట్టుకోవాలి.

అనవసరమైన సెంటిమెంట్లను పక్కనపెట్టి అసలు సమస్యను గుర్తించి అందుకు గల కారణాలను అన్వేషించాలి. పరిస్థితి పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలి. శరీరంలో ఒక్కప్రాంతమే అభివృద్ధి చెందితే దాన్ని బలమని ఎవ్వరూ అనరు. దాన్ని మనకు నచ్చినా నచ్చకపోయినా అంగవైకల్యమనే అంటాం. రోగంగానే భావించి ట్రీట్ మెంట్ తీసుకుంటాం. రాష్త్రమైనా అంతే, దేశమైనా అంతే. అన్ని ప్రాంతాలూ సుభిక్షంగా వుంటేనే మానవాళి సహోదర భావంతో జీవించేది. ఒక ప్రాంతం సంపదలతో తులతూగుతుంటే మిగిలిన ప్రాంతాలు దౌర్భాగ్యంతో కునారిల్లుతుంటే ఇలాంటి పోరాటాలు చరిత్రంతా పొడసూపక మానవు. అందులో మన క్షుద్ర రాజకీయ నాయకులను నిందించి లాభం లేదు. ప్రజాపోరాటాలతో వారి మనసులను మార్చాల్సిందే. ప్రజలు అజ్ఞానంలో వున్నన్నాళ్లూ వారికి చాలా హాయి. ప్రజలను అజ్ఞానంనుంచి బయటపడెయ్యాలి. మనమంతా పూనుకొని మనమన ప్రాంత చరిత్రను తవ్వితీసి మనమన వ్యాఖ్యానాలు జోడించకుండా వారికి నిజాలను గుత్తగా అందివ్వాలి. ఆ నిజాలను తెలుసుకున్న ప్రజలు చాలా సులువుగా మన రాజకీయ నాయకుల భరతం పడతారు. ప్రజలు మత్తులో వున్నంతవరకూ రాజకీయనాయకుల ఆటలు సాగుతాయి.

ఎవరెన్ని విధాలుగా భావించినా భ్రమించినా తెలంగాణ ఏర్పాటు తథ్యం. కానీ, మిగిలిన ప్రాంతమైనా కలకాలం కలిసి వుండాలంటే మనమెన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక టీవీ చర్చలో ప్రముఖ రాయలసీమ రచయిత భూమన్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటును మేము కోరుకుంటున్నాము గానీ, మా ఆందోళన అంతా ఒక్కటే. పక్కవాడిమీద పడి దోచుకుతిని బతకడం అలవాటుపడ్డవాడు ఇప్పుడు రాయలసీమ, ఉత్తరాంధ్రలపై పడి పీల్చిపిప్పిచేసేస్తారేమో అని అందోళన చెందారు. (నేను ఫకాలున నవ్వాను. నావైపు లత భయంభయంగా చూసింది. ఈ మధ్య నా వాదనల్లో కొంచెం అతి ఆవిడ చాలా జాగ్రత్తగా గమనించి ఆందోళన చెందుతోంది. నిజమే, ఆవిడ భయాన్ని నేను అర్థం చేసుకుంటున్నాను.) అప్పుడు చెప్పాను, కళింగాంధ్రులకు ఆ భయమేమీ అక్కరలేదు అని, ఇక్కడివారిని రాజకీయనాయకులు సగం దోచుకుంటే, మిగిలిన సగాన్ని కోస్తా వ్యాపార వర్గం ఎప్పుడో దోచుకుంది. ప్రస్తుతానికేమీ ఇక్కడి జనానికేమీ మిగల్లేదు. ఇకపై ఈ చర్చ ప్రత్యేకంగా కళింగాంధ్ర“లో కొనసాగుతూనే వుంటుంది. ప్రస్తుతానికి శెలవు.

సాహిత్యపుటూసులతో ఇదే పేజీల్లో కలుసుకుంటూనే వుందాం…

ప్రకటనలు

27 responses »

 1. అన్నదమ్ములు ఎప్పటికైన సరియైన సమయంలొ విడిపోవాల్సిందె.
  అవును, ఇప్పుడు తెలంగాణ వాళ్ల పరిస్థితి అప్పటి రెడ్ ఇండీయన్ల పరిస్థితే.
  నాలుగు కోట్లలో కనీసం 60 లక్షల మంది సీమాంధ్రులే. అంటె 12.5%. వాళ్ల ఆస్తులు విలువ చాలా చాలా అని చెప్పనవసరం లేదు. ఆదిపత్యానికి ఆకాశమే హద్దు. అధికార లెక్కలు లేవు కాని కోటి మంది ఉన్న ఉండవచ్చు. ఇప్పుడు దురాక్రమణ దశ దాటి, తెలంగాణ నిర్మూలన దశకు చేరుకుంటున్నది. పది, పదిహేను ఏండ్లు కలిసి ఉంటె తెలంగాణ ఉనికి ఉండదు.

 2. మీ తండ్రి నలుగురు కొడుకుల కథలో ఏం చెప్పాలనుకున్నారో కానీ అందులో నాకు మీకు అనిపించినవేమి నాకు అనిపించలేదు. చూపులోనే తేడా ఉందేమో మరి. ఎక్కువ సంపాదిస్తున్న కొడుకుకి ఎక్కువ ఖర్చు చేయటంలో ఉన్న తప్పేమిటో. వాడికి సంపాదనకు తగ్గట్టే ఖర్చులున్నాయేమో. ఒకరిదొకరికి రానప్పుడు కలిసి ఉండటమెందుకు అంటే తప్పకుండా విడిపోవచ్చు. అందుకు మొదటి కొడుకుది దోచుకునేవాడు, మిగతావారు దోచుకోబడేవారు ఎలాగయ్యారు. సమస్య విడిపోవటం కాదు, ఈ దోచుకోవటమనే నింద దగ్గరే అసలు సమస్య.

  శరీరంలో ఒక్క ప్రాంతమే ఎదిగితే అది ఖచ్చితంగా అంగవైఖల్యమే. అందుకు ఆ ఎదుగుతున్న భాగాన్ని కోసి పారేస్తే మిగతావి ఎదుగుతాయా. మిగతా భాగాలు అదే ఒంట్లో భాగాలైనా ఎందుకు మొదటిదానిలా బలం లాక్కోలేకపోతున్నాయో కనిపెట్టి ట్రీట్మెంట్ చెయ్యాలి. ఒంట్లోంచి బలం లాక్కోగలగే విధంగా వాటి పనితీరుని మెరుగుపరచనంత వరకు ముందు ఎదిగిన భాగాల్ని ఎన్నింటిని ఎన్నిసార్లు కోసిపారేసినా మిగతా వాటికి పంపిణీ అసమానంగానే ఉంటుంది.

 3. analysis adbutham aa.. :O :O :O.. konchem sense undi maatladandi.. rendu pitta kathalu chepte analysis aipodhu.. emaina mind undi maatladinatlu undha.. GMR godavari vaadu anekante mundhu telugu vaadu ani cheppukunnaadu.. monna varadhalu vaste.. mee telangana vallu em chesaaru.. mottam help chesindi kostha valley..

  theeskune tappudu gurrthuku raadhu meeku telangana.. ichetappudey gurthosthondha..??

  konchem burra petti maatladandi baabu..

 4. సార్ మీ అనాలిసిస్ అద్భుతం. నేను చాలా లేటుగా మీ బ్లాగులో మూడు భాగాలూ చదివాను. చాలా బాగా రాశారు. జై యునిటెడ్ ఆంధ్రా అని కాలేజీలు బంద్ చేసి, ప్రభుత్వ ఆస్తులను పాడు చేసే ప్రతి విద్యార్థికీ ఇదో గుణపాఠంలా ఉంది సార్..

 5. గాడిద ని గుర్రాన్ని ఒకే గాటి కి కట్టే మీ అదోరకమైన బుద్ది బాగానే కనపడుతుంది మళ్లి వేరే కధలేందుకు ? ఎంత తిన్న పరగడుపే మనకు !

 6. నమస్తే మాష్టారూ… మీరు ఫీల్ అవ్వను అంటే ఒక విషయం చెప్తా…స్టోరీ అనేది ఎలా కావాలంటే అలా రాయొచ్చు.
  అసలు మన స్టోరీలో స్టార్టింగ్ సెంటెన్స్ లోనే భయంకరమైన తప్పులు కదా.. పెద్ద కొడుకు బి టెక్, ఎం టెక్ మరియు పీ హెచ్ డి లు అని మీరు అంటారు. అదేమీ లేదురా నాయనా ఇక్కడ కుక్క చావు చస్తున్నాము అని వాడు అంటున్నాడు. అసలు దీని నిజానిజాలు తెలుసుకోవాలి కదా మరి….

  రెండవది, రెండవ కొడుకు డబ్బులు తీసుకుని పోయి పెద్ద వాడికి పెడుతున్నారు అన్నారు, దీని లెక్కలు కూడా చూపిస్తే సంతోషిస్తాం…

  ఈ రెండు వాక్యాలు కరెక్ట్ ఐతే, నీ మిగిలిన అనాలిసిస్ కేక అని ఒప్పుకుంటాం. అంతేకాని నీ ఇష్టం వచ్చిన ‘నిజాలు ‘ రాసి దాని మీద అనాలిసిస్ చేస్తాను అంటే కష్టం కదా అమ్మా……

 7. ఇంకొక విషయం
  మా జిల్లాలో నేను తిరుగాడేచోట తెలంగాణ ఉద్యమం గురించి వ్యతిరేకంగా మాట్లాడేవారినల్లా వారి కాళ్లూగడ్డాలూ పట్టుకుని బతిమాలేది ఒక్కటే. ఒరే ముందు మీ ముడ్డి తడుముకోండర్రా అని. అక్కడకు నీళ్లొచ్చి ఎప్పుడో నీ పంచె తడిసిపోయింది. అది చూసుకోకుండా అనవసరమైన వాగుడు నువ్వు వాగకురా నాయనా ఎర్రి నా మొగమా అని వేడుకుంటున్నాను.>> ఇది నిజం ముందు మీ ముడ్డి తడుముకోండి తరవాత తెలంగాణా గురించి చూడచ్చు .

 8. మీ పిట్ట కధలోనే నాకొక సందేహం
  బి. టెక్ పూర్తిచేసి, ఎం. టెక్ చదువుతున్న పెద్దకొడుకు పంపించిన కొద్దిపాటి డబ్బు, రెండవ కొడుకు పెట్టిన శ్రమ శక్తి తో ఒక మామిడి తోట అభివృద్ధి చేసారనుకుందాం. మీ విశ్లేషణ ప్రకారం విడిపోయేటప్పుడు, ఆ తోట ఎవరికి చెందాలంటారు? ఇప్పుడు హైదరాబాద్ గురించి జరుగుతున్నది అదే. హైదరాబద్ సంగతి పక్కన పెట్టి విభజన గురించి మాట్లాడండి.. ఒఖ్ఖ నెలలో తేలుతుంది. ఆ విధంగా తెలంగాణా వారి ఆత్మ గౌరవం కాపడబదుతుంది, స్వపరిపాలన వస్తుంది.

 9. బాబూ ప్రవీణ్ శర్మా.. తెలంగాణలో డబ్బులు ఉండేవాళ్లే లేరా ఏంది బాబూ.. 😮 .. కేసీఆర్ కు ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా నీకు.. వైజాగ్ లో ఒక ప్రైవేట్ పోర్ట్ కూడా కడుతున్నాడు.. అది నీకు తెలుసా? తెలిసినా మీకు కనిపించవు లెండి..ఎందుకంటే మీరు గురివింద గింజలు.. :)) ..

 10. నేను మీ విశ్లేషణలు చదివాను. చాలా పెద్ద దుమారమే రేగినట్టుంది. మీ బ్లాగులో ఎప్పుడూ ఇంత అలజడి చూడలేదు. మిమ్మల్ని ఒక్కొక్కరు ఇలా కామెంట్ చెయ్యడం చూస్తే చాలా బాధ కలిగింది. అయినా మీరు వ్యక్తిగతంగా ఎలాంటివారో తెలియక వాళ్లు అలా అన్నారేమో. నా దృష్టిలో భావప్రకటన చేసే హక్కు అందరికీ ఉంటుంది కాబట్టి మీ విశ్లేషణనూ, వారి అభిప్రాయాలను ఒప్పుకోక తప్పదు. కాని మనం కళింగాంధ్రలో ఉండి మన బాధ చెప్పుకోకపోతే ఎలా? కాబట్టి నేను మిమ్మలని సమర్దిస్తున్నాను. కాని స్వయం సమృద్ధిసాధించాల్సిన అవసరం అన్ని ప్రాంతాలవారికీ ఉంది. ఎన్ని ప్రాంతాలు వచ్చినా, ఎన్ని రాష్ట్రాలు విడిపోయినా చివరకు బాగుపడేది పాలకులే కాని ప్రజలు కాదు. ఈ సంగతి మీ విశ్లేషణను ఖండించేవారికి, మెచ్చుకునేవారికి అందరికీ తెలుసును. ఒక విద్యార్థిగా ఇంతకుమించి నేను చెప్పకూడదు. మీరు కొనసాగించండి.

 11. మీ వ్యాసం బాగుంది. మీకు మంచి పేరు వస్తుంది. ముందు ముందు మీరే నార్థ్ ఆంధ్రా కె.సీ.ఆర్. you will get good reputation in literature. All so called intellectuals/virasam people will appreciate you. k.sreenivas you will become one editor for any cheap magazine which provokes regional feelings. best of luck

 12. రవి కుమార్ గారూ,

  తెలంగాణా రాష్ట్ర అకాంక్షలపై మీరు రాసిన మూడు పోస్టులను చదివాను. చాలా అరుదుగా వినిపిస్తుంటాయి ఇటువంటి సహానుభూతి వాక్యాలు. మన చుట్టూ ఉన్నవారు కలిగి ఉన్న అభిప్రాయం కంటే భిన్నమైన అభిప్రాయాన్ని కలిగిఉండటమే ఒక సాహసం. అదీ ఇంత శక్తివంతంగా చెప్పగలగడం మరింత సాహసం.

  దాదాపు నాలుగు కోట్ల మంది ప్రజలు ఒక్కటే గొంతుతో నినదిస్తున్నా దానికి వక్ర భాష్యాలు చెప్పే “సమైక్యవాద” నాయకులు అక్కడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న విధానం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఖాయమని తెలిసి కూడా ఎవరికి వారు విడివిడిగా (కాంగ్రెస్, టిడిపి, పీఆర్పీ) నడుపుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాల్లో చిత్తశుద్ధి లేదు.

  తెలంగాణా నాయకులూ, పౌరుల భాగస్వామ్యం లేకుండానే నడుస్తున్న సమైక్యాంధ్ర ఉద్యమం ఒక పునాదిలేని కట్టడం వంటిది.

 13. Really appreciate what you have expressed knowing that you will be fired back by seemandhra people. The real problem is with andhra people no kalinga/seema. They try to dominate every other region. Truly speeking Telangana movement is against the politicians/businessmans of andhra.

 14. “కోస్తా వ్యాపార వర్గం ఎప్పుడో దోచుకుంది…!!!”
  ఏ బుక్ లో చదివారు బాబు మీరు?
  వాళ్ళు నీకు చేసిన మంచి కనబడలేదా!
  పచ్చ కామేర్లు

 15. చాలా బాగా రాశారు. మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ తెలిసినా, ఎవరితోనైనా ఎలా స్టార్ట్ చేయాలో అలాగే చెప్పాలో అర్థం కాదు. అంచేత ఈ మూడు పేజీలు అందుకు ఉపయోగపతాయి…

 16. చాలా బాగున్నాయ్ అన్నా… మంచిగ రాసినవ్. తెలంగాణ ఏర్పాటు తథ్యం. అన్ని రకాల ఆధిపత్యాలను వ్యతిరేకించే తెలంగాణను అందరూ చూస్తారు. స్ఫూర్తిని పొందుతారు. గీ సంగతి తెలంగాణ చరిత్ర తెలిసినోళ్లందరికి తెలుసు. ఏమైనా చాలా మంచిగ విశ్లేషించినవ్. ధన్యవాదాలు!

 17. కృష్ణ, తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు… ఈ జిల్లాల వాళ్ల వలసవాదం ఇతర ప్రాంతాలవాళ్లకు శాపమయ్యింది. వాళ్లు మాట్లాడిందే తెలుగు, వాళ్ల సంస్కృతి మొత్తం తెలుగు వాళ్లపై రుద్ది పారేశారు… ఎన్ని రోజులు ఊరుకుంటారు చెప్పండి…

 18. న్యాయ అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు గురించి మాట్లాడే ప్రతి ఒక్కరు మాట్లాడే ముందు ఒక్క క్షణం తాము తమ ప్రాంతానికి పనికి వచ్చే పని ఒక్కటంటే ఒక్కటి చేసామా అని ఆలొచించి మాట్లాడండి. ప్రాంతానికి రాష్ట్రానికి దేశానికి చేసి చచ్చింది లేదు, వకాల్తా పుచ్చుకుంటున్నారు.
  ఆటోమేటిక్ గా అడుగుతారు, నువ్వేందిరా పీకింది ఇప్పటి వరకూ అని. Through our non profit, we are supporting 250 children in all parts of Andhra Pradesh.
  I have not seen one constructive post in this whole agitation.
  ఊరికే లొల్లి తప్ప. Grow up guys, this is 21st century, not 19th.

 19. ఆంధ్రులలో నీతి జాతి ఉన్నవారు చాలా మంది ఉన్నారని
  మిమ్మల్ని చదివిన తరువాత అర్ధం అవుతోంది

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s