పుస్తకాలు కుప్పలు తెప్పలుగా విడుదల అయిపోతుంటే మనకున్న కాస్త సమయంలోనే వాటన్నింటిని ఎలా చదవడం? సింపుల్. ముందుగా పుస్తకాలను చదివిన వారి అభిప్రాయాలు తెలుసుకుని అంటే పుస్తక సమీక్షలు చదివి ఓ పుస్తకం కొనాలా వద్దా అని తేల్చుకోవడం మంచిది. ఏమంటారు? ఆ విషయంలో మీకు సాయపడ్డానికి ఈ బ్లాగు ప్రయత్నిస్తుంది. చదవండి. ఆశీర్వదించండి…

మీరు చదువుతున్న ఈ ‘చదువు ‘ బ్లాగరుడి గురించి ఈ నాలుగు మాటలు. దుప్పల రవికుమార్ పేరుతో కొన్ని ప్రత్యామ్నాయ పత్రికలకు పుస్తక పరిచయాలు, సమీక్షలు, ఇతర వ్యాసాలు రాస్తుంటాను. రాయడం కంటే చదవడం అంటే ఎక్కువ ఇష్టం. అంతకంటే ఎక్కువగా పుస్తకాలు కొనడాన్ని ఇష్టపడతాను. వారానికొకటైనా పుస్తకం పూర్తి చేయాలని తలంపుతో గత కొన్ని సంవత్సరాలుగా కృషి చేస్తున్నాను. వృత్తిరీత్యా శ్రీకాకుళంజిల్లా టెక్కలిలో ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో సాఫ్ట్ స్కిల్స్ ట్రైనరుగా పని చేస్తున్నాను. జాన్ పెర్కిన్సును తెలుగు పాఠకులకు పరిచయం చేసిన కొణతం దిలీప్ సాయంతో బ్లాగులో ఓనమాలు నేర్చుకుని వారానికొకటిగా పుస్తకాలను మిగతా బ్లాగరులైన సాహితీ మిత్రులతో పంచుకుందామని నా ఆశ.

ఇందులోని వ్యాసాలను చదివి మీ అభిప్రాయాలు రాయండి. పాఠకులను పుస్తకాలను చదవమని ఊరించే, రెచ్చగొట్టే, బతిమాలుకునే ఈ వ్యాసాలు అన్ని సాహిత్య ప్రక్రియలపైన వుంటాయి. అభిప్రాయాలను తొలగించడమనే ప్రశ్న ఈ బ్లాగులో ఉండదు. అలాగే వాటికి సమాధానాలు ఇవ్వకుండా ఉండడానికి సాధ్యమైనంత ప్రయత్నిస్తున్నాను.

26 responses »

 1. రవి గారూ,చినవీరభద్రుని”పునర్యానం’పరిచయం చేసారా,’మంచి కవిత్వం’.జనం లొనికి తీసుకుని రండి.

 2. sir your blog is so good and hatsoff to ur daily updation one thing i want to say is being a computer background students so many of them they dont no anything about blog and i create a blog but i cant update it in such a pathetic situation a non computer background person can develop a blog and update it .once again congrats to u for giving inspiration regarding blog and also your blog ratings also reaches to 16000 once again congrats . i have know english but that is not reaches to ur subject level. so if there any mistakes regarding comments please tell me and definitely i will rectify.
  keep on bloging ,
  yours suresh
  aitam tekkali

 3. రవి కుమార్ గారు గతంలో నా ఆఫిస్ మేడ మీద ఉన్న ఒక స్థానిక పత్రిక కార్యాలయణికి వచ్చే వారు. కొన్ని సార్లు నా దగ్గరకి కూడా వచ్చారు. అతను వ్రాసే రివ్యూస్ బాగుంటాయని పత్రిక ఏడిటర్ కూడా చెప్పారు.

 4. ఓ సారి రవి గారు నా అఫీస్ కి వచ్చినప్పుడు నేను రంగనాయకమ్మ గారు వ్రాసిన “చైనాలో ఏమి జరుగుతోంది” అనే పుస్తకం చదువుతూ కనిపించాను. రవి గారు దాని గురంచి అడిగారు. అప్పుడు నేను మార్క్సిస్టునని, అందులో రంగనాయకమ్మ గారి సాహిత్యం కూడా చదువుతుంటానని చెప్పాను. ఆంతకు ముందు రవి గారి గురించి పత్రిక ఎడిటర్ చెప్పగా విన్నాను కానీ అతని వ్యాసాలు చదవలేదు. నేను ఎక్కువగా మార్క్సిస్ట్ సాహిత్యం చదువుతుంటాను. సినిమా కబుర్లు ఎక్కువగా రాసే పత్రికలో రంగనాయకమ్మ గారి పుస్తకం పై రివ్యూ పబ్లిష్ అవుతుందని నేను ఊహించలేదు. రంగనాయకమ్మ గారు సినిమాలని కూడా విమర్శిస్తూ వ్యాసాలు వ్రాసారు.

 5. బ్లాగ్‍ నడపడంలో మీ వుద్దేశం, దాన్ని మీరు వివరించిన తీరు చాల బాగుంది. బ్లాగ్స్ తో ఎక్కువ పరిచయం లేకపోవడంతో తెలీలేదు. ఈ స్పేస్ లో ఇలా మంచి పనులకు అవకాశం వుందని… కొత్తపాళీ గారు చేస్తున్న పనిని చూసి, మళ్లీ మీ పని చూసి తెలిసి వచ్చింది. కంగ్రాట్స్
  హెచ్చార్కె

 6. దుప్పల రవి కుమార్ గారూ ! అనుకోకుండా ఈరోజు మీ బ్లాగ్ చూశాను. మంచి పుస్తకాల సమీక్ష ఎవరికి మాత్రం చేదు? ఎక్కువ పుస్తకాలు చదవాలని కోరిక ఉన్నా చదవలేని వారికి మీ సమీక్షలు చదివి ఎంచుకోండి అనే సలహా చాలా బావుంది. కాని మంచి సమీక్షలు అది కూడా మంచి పుస్తకాల మీద, దొరకడం కష్టమని బాధ పడే నాలాంటి వారికి మీ బ్లాగు ఖచ్చితంగా ఊరట. తప్పనిసరిగా కొనసాగించండి.
  మేఘ గారు చెప్పినట్లు చిన వీరభద్రుని “పునర్యానం”గురించి మీరు తప్పక వ్రాసి తీరవలసిందే! మీరు ఇప్పటికే చదివి ఉంటారు. లేకపోతే సమీక్ష రాయడానికోసమైనా మీరు ఆ పుస్తకం చదువుతారు. అది మీ అదృష్టం. మీరు సమీక్ష రాస్తే మా అదృష్టం. మరో మనవి. శ్రీరమణ గారి ‘మిధునం’ చదివే ఉంటారు. ఆ కధ కూడా పదిమందికి పరిచయం చెయ్యడం వారికి అదృష్టం అవుతుంది.

 7. డియర్ రవి, మీ ఆశయం,అభిలాష,అభిమతం పూసగ్రుచ్చినట్లు చెప్పారు. బాగుంది. కార్యసాధకుడెప్పుడూ నిర్మాణాత్మకంగా ఆలోచించాలి ,ఆచరణలో చూపాలి .అది మీలో కనపడుతోంది.అభినందనలు.మీరు నిర్మొహమాటంగా
  వ్యాఖ్యలకు సమాధానాల విషయంలొ పెట్టుకున్న నిభందన సడలిస్తే నిర్ణయాత్మక సూచనలు రావడానికి వాటిపై చర్చ జరగడానికి అవకాశం యిచ్చినవారవుతారని నేను భావిస్తున్నాను. .క్రింద నేను చదివిన రెందు గ్రంధాల గురించి మీకు తెలియజేస్తున్నాను .

  యీ మధ్యనే డా.సి.నారాయణరెడ్డి గారి చేతుల మీదుగా హైదరబాద్ త్యాగరాయ గాన సభలో ఆవిష్కరింపబడిన శ్రీ పులిగడ్డ విశ్వనాధరావు గారి “కలియుగ క్రిష్ణార్జునులు ఇతరకథలు” సున్నిత హాస్య వ్యంగ్య కధా తోరణం.రచయిత cell no.9491354480 . అవకాశముంటే ఆయనకు ఫోను చేయండి మీకు ఆ సంకలనం అందుతుందని ఆశిస్తున్నాను.

  అలాగే ప్రసిద్ధ భావకులు, సాహితీవేత్త ,చిత్రకారులు,సాహితీ విమర్శకులు,సర్గీయ డా.శ్రీ.సూర్యదేవర సంజీవదేవ్ గారి
  BLUE BLOOMS in english(Poems) తప్పక చదివి తీరాల్సిన ఆంగ్ల కవితా గ్రంధం. ఒక వు,దా:
  The candle of love
  Burns and burns
  On the altar of the heart
  In the shrine of the body … a stanza from. “.Light of Love”

  ప్రకాశకులు: పి.లక్ష్మయ్య, ప్లాట్ నం.240, Road No.3,Vivekananda Nagar,Hyderabad…5000872,I don”t know now if he is there or not.
  అభినందిస్తూ …ఆశీస్సులు…..నూతక్కి.

 8. మీ బ్లాగ్ మొదటిసారి చూస్తున్నానండి ..
  మీ ప్రయత్నం చాలా బాగుంది ..
  పుస్తకాలు చదవించడానికి మీరు చేస్తున్న ప్రయత్నానికి జోహార్లు .

 9. విశాఖ లో విశలాంధ్ర లో ‘కారా’ మాస్టారి పుస్తకాలు గానీ, రావి శాస్త్రి గారి రచనలు గానీ నాకు దొరకలేదు. దయచేసి చక్కని పుస్తకాలు దొరికే చోటు (విశాఖ లో) తెలియజేయగలరు.

 10. sir sorry i do not have telugu script. by the way do you read telugu literature or confine only to western and english works. if not why don’t you enlighten us with your review of rendu dasabbhaalu of katha sahithi. i am very eager to know about stories like kinda nela vundi, sujata and maaya. thanks for the reading

  • ఆత్మీయ మిత్రులకు సుమాంజలి! ఈ సంవత్సరం “నిమజ్జనం” కథాసంపుటి ఆవిష్కరణ జరిగినది. అది నా స్వీయరచన.మీ చిరునామాకు రెండు
   కాఫీలు పంపుచున్నాను.మీ అమూల్యమైన సమీక్ష రాయగలరని ఆశించుచున్నాను ..దన్యవాదములు

   డాక్టర్ :జి .వి. క్రిష్ణయ్య. కొత్తపట్నం 523286
   9866381977

 11. రవికుమార్ గారు నమస్కారం మీ మిత్రుడు ఇచ్చిన సలహా మేరకు బ్రాగ్ ద్వారా విలువైన సమాచారం ఇచ్చేప్రయత్నం చేస్తునందుకు ధన్యవాదములు అయితే వారానికి ఒక పుస్తకాన్ని అయినా చదవడం పూర్తిచేయాలనే మీ ఆలోచన మంచిదే కానీ మీరు తెలుసుకున్న విషయాలను మిత్రులతో పంచుకునే ప్రయత్నం మంచిది అని నా అభిప్రాయం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s