Category Archives: మరింకేదైనా..

PRAJASAKTI TELUGU NEWS PAPER DAILY-2011 తెలుగు సాహిత్యం ఓ విహంగ వీక్షణం

సాధారణం

PRAJASAKTI TELUGU NEWS PAPER DAILY-2011 తెలుగు సాహిత్యం ఓ విహంగ వీక్షణం.

ప్రకటనలు

‘హక్కుల’ ఊపిరి హరిస్తారా?

సాధారణం

జనవరి 13.

భోగీ పండుగ.

చెడుకు ప్రతీకగా భావించి పెద్దపెద్ద కర్ర దుంగలను ఒకచోట పేర్చి భోగీమంట పెట్టి దేశమంతటా చలి కాచుకుంటారు. కానీ మహారాష్ట్రలో పూణెకు దగ్గరలో వున్న లోనోవాలా ప్రాంతంలో నివశిస్తున్న 39 ఏళ్ల సతీష్ శెట్టికి మాత్రమ్ జీవితం చీకటయింది ఆ తెల్లవారి జామునే. Read the rest of this entry

మీరెటువైపు?

సాధారణం

అది త్రేతాయుగం…

నూనూగు మీసాల నూతన యవ్వనంలో పడుచు అందాల రాముడు తన తోటి సావాసగాళ్లతో రవ్వంత తుళ్లింతతో ఆటపాటలలో లీనమైవుండగా, తమ రాజసౌధానికి వచ్చిన మునులకు వంగి ప్రణమిల్లి వారికి దారిచ్చి మరలా తన ఆటలో మునిగిపోయాడు. అలా వెళ్లిన మునులు ఇలా తననే రమ్మనేసరికి ఆశ్చర్యపోతూ బిడియపడుతూ తండ్రి దశరథరాజు కొలువులోకి అడుగుపెట్టాడు. వారు చెప్పిందంతా విని మ్రాన్పడిపోయాడు. Read the rest of this entry

ఒక సోంపేట – కొన్ని గుణపాఠాలు

సాధారణం

గత రెండు దశాబ్దాలుగా సర్దార్ సరోవర్ డ్యామ్ కు వ్యతిరేకంగా గిరిజనులను, ఆదివాసులను, రైతాంగాన్ని, పర్యావరణవాదులను, మానవహక్కుల పోరాటకారులను ఏకతాటిమీద నిలబెట్టి ఉద్యమ సారధ్యం చేస్తున్న మేధాపాట్కర్ శ్రీకాకుళం జిల్లా సోంపేట పోలీసుల కాల్పులలో హతులైన వారి కుటుంబాలను పరామర్శించడానికి వచ్చినపుడు యాదృచ్ఛికంగా ఆ రోజే చనిపోయిన వారికి ఆ కుటుంబీకులు పెద్ద కర్మ చేస్తున్నారు. ఎటువంటి రాజకీయ, అరాజకీయ దన్నులు లేకుండా ప్రజలే నడుపుకొంటున్న ఈ ఉద్యమాన్ని చూసి నివ్వెరపోయిన ఆమె Read the rest of this entry

…ఓ పాఠకుడి స్టేట్ మెంట్…

సాధారణం

నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను ఉత్తుంగ తరంగంలా వ్యక్తం చేస్తున్నప్పుడు…. వారి మనసు గుర్తెరిగి వారి ఆత్మగౌరవ నినాదాన్ని మన్నించి… వారి ప్రయత్నాలను గౌరవించాల్సింది పోయి… ఇవ్వాళ రాష్ట్రంలో జరుగుతున్న దారుణ దురాగతాన్ని నివ్వెరపోయి చూస్తూ… చాలా రోజులు మౌనంగా వుండిపోయాను. నిరాశతో… నిస్సత్తువతో… Read the rest of this entry

కథో కథకుడో నచ్చకపోతే అదే చెప్పాలి, అంతేకాని అబద్దాలాడకూడదు

సాధారణం

“కథ ఇచ్చే అనుభూతి విలువను పాఠకుడు ప్రయత్నపూర్వకంగా నిర్ణయిస్తాడు. జీవితం పట్ల అతనికున్న అభిప్రాయాలు అతని భావజాలాన్ని నిర్ణయిస్తాయి. సాహిత్యం ద్వారా అతడు ఆశించే ప్రయోజనాన్ని అతని భావజాలం నిర్ణయిస్తుంది. ఆ ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠకుడు కథ విలువను నిర్ణయించటానికి ప్రయత్నిస్తాడు”. 

‘వల్లంపాటి సాహిత్య వ్యాసాలు’ (పే. 46) నుంచి

1

‘వార్త’ ఆదివారం అనుబంధం (మార్చి 23, 2008)లో ప్రచురితమైన గంటేడ గౌరునాయుడు కథ “మాయ” తర్వాత ‘కథావార్షిక – 2008’లో చోటుచేసుకుంది. త్వరలో రానున్న ‘కథ-2008’లో చోటుచేసుకోబోతుంది. ఇదికాక ప్రవాసాంధ్రుల పత్రిక ‘తెలుగునాడి’లో సైతం పునర్ముద్రణ పొందింది. తెలుగు కథాప్రియుల ఆదరాభిమానాలు సైతం పొందిందనే కళింగాంధ్ర కథాభిమానిగా భావిస్తూ వచ్చాను. Read the rest of this entry

బాలగోపాల్ ఇకలేరు…

సాధారణం

balagopal1నేను దేవుడ్ని నమ్ముతాను. కాని, గుడ్డిగా నమ్మను. అంటే హీరో వర్షిప్ లేదు. అయితే, నా జీవితంలో కొందరు హీరోలున్నారు. వారంటే నాకు పిచ్చి భక్తి. వారి మాటల్నీ, రాతల్నీ, మొత్తంగా వారినీ ఎంతో ఇష్టంగా అభిమానిస్తాను. అలాంటి వారికి దేవుడు ఈ మధ్యన వరసగా అన్యాయం చేస్తున్నాడు. మొన్న పతంజలి బావు, నిన్న వైఎస్ సార్, ఈ రోజు బాలగోపాల్….. దరిద్రపు దేవుడా! ఇలా మన నిజజీవితంలో దేవుళ్లా కొలుచుకునేవాళ్లు ఒక్కొక్కరే మనల్ని విడిచి వెళ్లిపోతుంటే మనసు నిభాయించుకోలేకపోతోంది. గుండె తట్టుకోలేకపోతోంది. కన్నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. Read the rest of this entry