Category Archives: మరింకేదైనా..

కథో కథకుడో నచ్చకపోతే అదే చెప్పాలి, అంతేకాని అబద్దాలాడకూడదు

సాధారణం

“కథ ఇచ్చే అనుభూతి విలువను పాఠకుడు ప్రయత్నపూర్వకంగా నిర్ణయిస్తాడు. జీవితం పట్ల అతనికున్న అభిప్రాయాలు అతని భావజాలాన్ని నిర్ణయిస్తాయి. సాహిత్యం ద్వారా అతడు ఆశించే ప్రయోజనాన్ని అతని భావజాలం నిర్ణయిస్తుంది. ఆ ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠకుడు కథ విలువను నిర్ణయించటానికి ప్రయత్నిస్తాడు”. 

‘వల్లంపాటి సాహిత్య వ్యాసాలు’ (పే. 46) నుంచి

1

‘వార్త’ ఆదివారం అనుబంధం (మార్చి 23, 2008)లో ప్రచురితమైన గంటేడ గౌరునాయుడు కథ “మాయ” తర్వాత ‘కథావార్షిక – 2008’లో చోటుచేసుకుంది. త్వరలో రానున్న ‘కథ-2008’లో చోటుచేసుకోబోతుంది. ఇదికాక ప్రవాసాంధ్రుల పత్రిక ‘తెలుగునాడి’లో సైతం పునర్ముద్రణ పొందింది. తెలుగు కథాప్రియుల ఆదరాభిమానాలు సైతం పొందిందనే కళింగాంధ్ర కథాభిమానిగా భావిస్తూ వచ్చాను. Read the rest of this entry

బాలగోపాల్ ఇకలేరు…

సాధారణం

balagopal1నేను దేవుడ్ని నమ్ముతాను. కాని, గుడ్డిగా నమ్మను. అంటే హీరో వర్షిప్ లేదు. అయితే, నా జీవితంలో కొందరు హీరోలున్నారు. వారంటే నాకు పిచ్చి భక్తి. వారి మాటల్నీ, రాతల్నీ, మొత్తంగా వారినీ ఎంతో ఇష్టంగా అభిమానిస్తాను. అలాంటి వారికి దేవుడు ఈ మధ్యన వరసగా అన్యాయం చేస్తున్నాడు. మొన్న పతంజలి బావు, నిన్న వైఎస్ సార్, ఈ రోజు బాలగోపాల్….. దరిద్రపు దేవుడా! ఇలా మన నిజజీవితంలో దేవుళ్లా కొలుచుకునేవాళ్లు ఒక్కొక్కరే మనల్ని విడిచి వెళ్లిపోతుంటే మనసు నిభాయించుకోలేకపోతోంది. గుండె తట్టుకోలేకపోతోంది. కన్నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. Read the rest of this entry

ఈ స్వాతంత్ర్య దినోత్సవాన తెలుగు సాహిత్య లోకమంతా శ్రీకాకుళంలోనే…

సాధారణం

కొంచెం అతిగా కన్పించినా ఇది నిజం. సాహిత్య అకాడెమీ, కథానిలయం, శ్రీకాకుళ సాహితి సంయుక్తంగా నిర్వహిస్తున్న కొడవటిగంటి కుటుంబరావు నూరేళ్ల సంబరాలకు ఈసారి శ్రీకాకుళం వేదిక అవుతోంది. దీనికి మహామహులందరూ వస్తున్నారు. పూర్తి వివరాలిదిగో: Read the rest of this entry

పతంజలి స్మృతికి నామిని అర్పిస్తున్న నివాళి…

సాధారణం

రచయిత, జర్నలిస్ట్, ఆయుర్వేద వైద్యుడు, మహా మనీషి పతంజలి మరణం ఆయన అభిమానుల్లో ఎంతో వేదన కలిగించింది. వారంతా తమ బాధను మాటల్లోనూ, పాటల్లోనూ, చిత్రాల్లోనూ వ్యక్తం చేశారు. తెరచాటుకు పోయిన మరో గొప్ప రచయిత నామిని పతంజలిపై తన అభిమానాన్నిఅక్షరరూపంలో పెడితే పన్నెండు పేజీలయింది. అదిక్కడ యథాతథంగా అందిస్తున్నాను. నా బ్లాగుకీ అవకాశం కలిగించిన నామినికి నా ప్రత్యేక కృతజ్ఞత.                      -దుప్పల రవికుమార్  Read the rest of this entry

సమాజ భాష్యకారుడు పతంజలికి నివాళి

సాధారణం

తెలుగు సాహితీ వినీలాకాశంలో మరో తార నేలకొరిగింది. కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే గొంతుమూగబోయింది. నిత్యం ప్రజాపక్షపాతం వహించే రచయిత కలం మరి రాయనని మొరాయించింది. ప్రతి మాటలోనూ వర్గ దృక్పథాన్ని ఎత్తి చూపించిన కలంకారి కన్నుమూశాడు. ప్రముఖ రచయిత కె. ఎన్. వై. పతంజలి మరణించాడు.  Read the rest of this entry