Category Archives: Uncategorized

‘హక్కుల’ ఊపిరి హరిస్తారా?

సాధారణం

జనవరి 13.

భోగీ పండుగ.

చెడుకు ప్రతీకగా భావించి పెద్దపెద్ద కర్ర దుంగలను ఒకచోట పేర్చి భోగీమంట పెట్టి దేశమంతటా చలి కాచుకుంటారు. కానీ మహారాష్ట్రలో పూణెకు దగ్గరలో వున్న లోనోవాలా ప్రాంతంలో నివశిస్తున్న 39 ఏళ్ల సతీష్ శెట్టికి మాత్రమ్ జీవితం చీకటయింది ఆ తెల్లవారి జామునే. Read the rest of this entry

భరాగోకు తెలుగు సాహితీ ప్రపంచం రుణపడి వుండాల…

సాధారణం

ఆరేడు నెలల కిందట ఒకరోజు విశాఖపట్నం నుంచి బస్సులో వస్తుండగా ఫోన్ మోగింది. నెంబరు విశాఖపట్నానిది. చెవులకు దగ్గరగా ఫోన్ పెట్టుకుని మాటలు విందామని ప్రయత్నిస్తుంటే అవతల మాట్లాడుతున్నది భమిడిపాటి రామగోపాలం. ప్రజాసాహితి మాసపత్రికలో “ఏకాంతసేవ” పుస్తకాలు భరాగో దగ్గర దొరుకుతాయన్న మాట చదివి ఆయనకు కార్డు రాస్తే దానికి బదులుగా వచ్చిన కాల్ అది. Read the rest of this entry

…ఓ పాఠకుడి స్టేట్ మెంట్… మూడో భాగం

సాధారణం

ఒక తండ్రికి నలుగురు కొడుకులున్నారు. ఒక కొడుకు బి. టెక్ పూర్తిచేశాడు. ఎం. టెక్ చదువుతున్నాడు. ఆ తరువాత పీహెచ్ డి చేస్తాడు. ఆపైన పోస్ట్ డాక్టరల్ రిసెర్చ్ చేస్తాడు. ఆ తరువాత స్వయంగా రిసెర్చ్ చేసి ఏదైనా ఒక ప్రత్యేకమైన వస్తువు కనిపెట్టాలని కోరిక. ఆ పై ప్రభుత్వం ఇచ్చే అవార్డు సొమ్ము అంతా తన కుటుంబానికే ‘అంకితం’ చేసేస్తాడు. రెండో కొడుకు పెద్దగా చదువుకోలేదు అయినా రెక్కలు ముక్కలు చేసుకుని ఇంటికి సరిపడా డబ్బులు సంపాదిస్తున్నాడు. Read the rest of this entry

…ఓ పాఠకుడి స్టేట్ మెంట్… రెండవ భాగం

సాధారణం

ఈ టపా మొదటి భాగంలో రాసిన మాటల్లో రామోజీరావు వ్యాపార వ్యవహార సరళి గురించి ప్రస్తావించినప్పుడు ‘పచ్చళ్లు అమ్ముకోవడం’ అని రాసినందుకు పాఠక మిత్రులు బాధపడ్డారు. నిజమే. అది నా తప్పిదం. అలా రాసి పచ్చళ్లు అమ్ముకున్న వాళ్లను అవమానించడం డీఫాల్ట్ మిస్టేక్ గా జరిగింది. దానికి పచ్చళ్లతో సహా, పేపర్లు అమ్ముకుంటూ జీవిక పొందుతున్న నా దేశ సోదరులందరికీ క్షమాపణలను కోరుతున్నాను. Read the rest of this entry

ఇవి మీరు తప్పక చదవాల్సిందే!

సాధారణం

కిందటి వారం ఈ బ్లాగులో వచ్చిన “కథో కథకుడో నచ్చకపోతే అదే చెప్పాలి గాని, అబద్దాలాడకూడదు” అన్న వ్యాసానికి మిత్రులు చాలా సానుకూలంగా స్పందించారు. అయితే ఎక్కువమంది ఆ “మాయ” (రచయిత గంటేడ గౌరునాయుడు) కథను, దానిపై జాన్సన్ చోరగుడి రాసిన విమర్శను కూడా అందివ్వమన్నారు.

కానీ సాంకేతికంగా ఆ పనులు చేతకాక ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నప్పుడు విశాఖపట్నంలోని ప్రింటెక్స్ సంస్థ యజమాని ఉమేష్ గొప్ప సాయం చేశారు. “మాయ” కథను, జాన్సన్ విమర్శ వ్యాసాన్ని విడివిడిగా పీడీఎఫ్ పైళ్లు తయారుచేసి అందించారు. వాటిని ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను. దయచేసి వీటిని చదివి మళ్లీ నా వ్యాఖ్యను చదవమని కోరుకుంటున్నాను. Read the rest of this entry

ఈ ఆదివారం శ్రీకాకుళంలో వుంటే గనక ప్రెస్ క్లబ్ కు తప్పక రండి!!!

సాధారణం

పుస్తకాల పరిచయ సభ

కస్తూరి మురళీకృష్ణ గారు రచించిన రెండు పుస్తకాల అవిష్కరణలు శ్రీకాకుళంలో జరుగుతున్నాయి. వాటికి మీకిదే మా సాదర ఆహ్వానం!

1. “తీవ్రవాదం”
పుస్తక ఆవిష్కరణ: హనుమంతు సాయిరాం (ఎన్ జీవో సంఘపు జిల్లా శాఖ అధ్యక్షుడు)
పుస్తక పరిచయం: కొంక్యాన వేణుగోపాల్ (శ్రీకాకుళం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు)
స్పందన: గుడిపాటి (పాలపిట్ట ప్రచురణలు ఎడిటర్)

2. “మైఖేల్ జాక్సన్”
పుస్తక ఆవిష్కరణ: యగళ్ల రామకృష్ణ (సీనియర్ పాఠకులు)
పుస్తక పరిచయం: అరుణ్ బవేరా (కవి, ఆంధ్రజ్యోతి ఉప సంపాదకులు)
స్పందన: కస్తూరి మురళీకృష్ణ (పై రెండు పుస్తకాల రచయిత)

సమయం: 13 సెప్టెంబర్, 2009 (ఆదివారం) ఉదయం పది గంటలకు
వేదిక: ప్రెస్ క్లబ్, ఎన్ టీ ఆర్ మున్సిపల్ హైస్కూల్ ఎదురుగా, ఏడురోడ్ల జంక్షన్, శ్రీకాకుళం.

ప్రత్యేక ఆకర్షణ: పాలపిట్ట ప్రచురణలు ప్రత్యేక తగ్గింపు ధరలో అందివ్వనున్నారు.

మరిన్ని వివరాలకు నాకు (9989265444) లేదా సమీక్ష క్లబ్ కార్యదర్శి శ్రీలతకు (9989265454) లేదా బెందాళం కృష్ణారావుకు (9985431666) ఫోన్ చేయండి.

కిందటేడాది మే, జూన్ నెలల్లో పరిచయం చేసిన పుస్తకాలు

సాధారణం

మీరు చదివారా?” బ్లాగులో వారానికొకటి చొప్పున పుస్తకాన్ని పరిచయం చేస్తున్న సంగతి మీకు తెలిసిందే. కిందిటేడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ దిగువ పుస్తకాల మీద పరిచయ వ్యాసాలు అందించాను. వాటిని మరొక్కమారు మీకు గుర్తుచేసే ప్రయత్నమిది. Read the rest of this entry