పోటీ పరీక్ష

సాధారణం

అకస్మాత్తుగా తెలివి వచ్చింది. ఎవరో తలుపు కొడుతున్న చప్పుడు. గడియారం వైపు చూశాను. ఐదు కావస్తోంది. ‘ఇంత ఉదయాన్నే ఎవరబ్బా’ సందేహిస్తూ దుప్పటి తీసి నిద్రకళ్లతో వెళ్లి తలుపు తీశాను. ఆశ్చర్యం! ఎదురుగా పద్మనాభం. నుదురంతా చెమట పట్టివుంది. లోనికి తీసుకొచ్చాను. టెర్రస్ మీద కుర్చీ సర్ది కూర్చోబెట్టి ముఖం కడుక్కోవడానికి వెళ్లాను. Read the rest of this entry

ప్రకటనలు

భరాగోకు తెలుగు సాహితీ ప్రపంచం రుణపడి వుండాల…

సాధారణం

ఆరేడు నెలల కిందట ఒకరోజు విశాఖపట్నం నుంచి బస్సులో వస్తుండగా ఫోన్ మోగింది. నెంబరు విశాఖపట్నానిది. చెవులకు దగ్గరగా ఫోన్ పెట్టుకుని మాటలు విందామని ప్రయత్నిస్తుంటే అవతల మాట్లాడుతున్నది భమిడిపాటి రామగోపాలం. ప్రజాసాహితి మాసపత్రికలో “ఏకాంతసేవ” పుస్తకాలు భరాగో దగ్గర దొరుకుతాయన్న మాట చదివి ఆయనకు కార్డు రాస్తే దానికి బదులుగా వచ్చిన కాల్ అది. Read the rest of this entry

ఈ మాసం పత్రిక “బిబ్లియో”

సాధారణం

నిజానికి కవిత్వం కన్నా నవలలంటే, వాటి కన్నా కథంటే, వాటికన్నా వ్యాసమంటే నాకు మక్కువ ఎక్కువ. అందులో పుస్తక పరిచయ వ్యాసాలన్నా, రచయితల పరిచయ వ్యాసాలన్నా పడిచస్తాను. అసలు తెలుగులో కేవలం పుస్తక పరిచయాలకోసమే ఒక పత్రిక ఎందుకులేదన్న నా పరిశోధనకు సమాధానమే ఈ “మీరు చదివారా?” బ్లాగు రూపకల్పన. (అతిత్వరలో ఈ తరహాలో ఒక మేగజీన్ కూడా తీసుకురావాలని సంకల్పం.) Read the rest of this entry

…ఓ పాఠకుడి స్టేట్ మెంట్… మూడో భాగం

సాధారణం

ఒక తండ్రికి నలుగురు కొడుకులున్నారు. ఒక కొడుకు బి. టెక్ పూర్తిచేశాడు. ఎం. టెక్ చదువుతున్నాడు. ఆ తరువాత పీహెచ్ డి చేస్తాడు. ఆపైన పోస్ట్ డాక్టరల్ రిసెర్చ్ చేస్తాడు. ఆ తరువాత స్వయంగా రిసెర్చ్ చేసి ఏదైనా ఒక ప్రత్యేకమైన వస్తువు కనిపెట్టాలని కోరిక. ఆ పై ప్రభుత్వం ఇచ్చే అవార్డు సొమ్ము అంతా తన కుటుంబానికే ‘అంకితం’ చేసేస్తాడు. రెండో కొడుకు పెద్దగా చదువుకోలేదు అయినా రెక్కలు ముక్కలు చేసుకుని ఇంటికి సరిపడా డబ్బులు సంపాదిస్తున్నాడు. Read the rest of this entry

…ఓ పాఠకుడి స్టేట్ మెంట్… రెండవ భాగం

సాధారణం

ఈ టపా మొదటి భాగంలో రాసిన మాటల్లో రామోజీరావు వ్యాపార వ్యవహార సరళి గురించి ప్రస్తావించినప్పుడు ‘పచ్చళ్లు అమ్ముకోవడం’ అని రాసినందుకు పాఠక మిత్రులు బాధపడ్డారు. నిజమే. అది నా తప్పిదం. అలా రాసి పచ్చళ్లు అమ్ముకున్న వాళ్లను అవమానించడం డీఫాల్ట్ మిస్టేక్ గా జరిగింది. దానికి పచ్చళ్లతో సహా, పేపర్లు అమ్ముకుంటూ జీవిక పొందుతున్న నా దేశ సోదరులందరికీ క్షమాపణలను కోరుతున్నాను. Read the rest of this entry

…ఓ పాఠకుడి స్టేట్ మెంట్…

సాధారణం

నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను ఉత్తుంగ తరంగంలా వ్యక్తం చేస్తున్నప్పుడు…. వారి మనసు గుర్తెరిగి వారి ఆత్మగౌరవ నినాదాన్ని మన్నించి… వారి ప్రయత్నాలను గౌరవించాల్సింది పోయి… ఇవ్వాళ రాష్ట్రంలో జరుగుతున్న దారుణ దురాగతాన్ని నివ్వెరపోయి చూస్తూ… చాలా రోజులు మౌనంగా వుండిపోయాను. నిరాశతో… నిస్సత్తువతో… Read the rest of this entry

స్వేచ్ఛావలోకనమే కవి(త)త్వం – ఛాయరాజ్ ‘దర్శన’మ్

సాధారణం

శిల్పగతమైన శక్తులు ఎన్నివున్నా, కవికి వ్యక్తిత్వాన్ని ఇచ్చేవి అతని విశ్వాసాలు, అభిప్రాయాలే. సమాజం గురించి, జీవితం గురించి స్థిరమైన అభిప్రాయాలు లేనివాడు ఎన్నాళ్లయినా తనదని చెప్పుకోదగ్గ వ్యక్తిత్వం పొందలేడు. ఈ నిర్దిష్టమైన విలువలు తన ప్రతి రచనలోనూ మేళవించి సామాజిక ప్రయోజనం పరమావధిగా రచనలు చేస్తున్న అతి కొద్దిమంది తెలుగు కవులలో ఛాయరాజ్ ఒకరు. శ్రీకాకుళం పట్టణానికి చెందిన కవి ఛాయరాజుకు 2005లో ప్రతిష్టాత్మక ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు లభించింది. తెలుగు కవిత్వంలో Read the rest of this entry