Author Archives: దుప్పల రవికుమార్

మన ప్రపంచం 31… అజెండా

సాధారణం

అభిమానుల ఆనంద సందోహాల మధ్య ఆంధ్రుల ఆరాధ్య నటుడు బాలకృష్ణ తన రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రకటించేశారు. ఎన్టీయార్ పుత్ర రత్నాలు ఒక్కొక్కరుగా ఆపద్ధర్మంగా ఆరంగేట్రం చేస్తున్నా అందరూ పొలిటికల్ స్క్రీన్ మేద తోలుబొమ్మలే అవుతున్నారు. ఆడేదీ ఆడించేదీ అంతా బావగారే. ఇప్పుడే కాదు… నందమూరి కుటుంబంలో కథానాయకుడు ఎవరైనా కథనం చంద్రబాబుదే. ఆ మాటకొస్తే ఎన్టీయార్ కే దిక్కులేదు. హరికృష్ణ లేదంటే బాలకృష్ణ లేదంటే పానకంలో పుడక జూనియర్ ఎన్టీయార్ లేదంటే మరొకరు అంతా ఆఫ్టరాల్. చంద్రబాబుకు ఎవరైనా కేరేజాట్. Read the rest of this entry

PRAJASAKTI TELUGU NEWS PAPER DAILY-2011 తెలుగు సాహిత్యం ఓ విహంగ వీక్షణం

సాధారణం

PRAJASAKTI TELUGU NEWS PAPER DAILY-2011 తెలుగు సాహిత్యం ఓ విహంగ వీక్షణం.

మన ప్రపంచం – ౨౨

సాధారణం

మన ప్రపంచం – ౨౨

గాడ్ మెన్

 వార్తాపత్రికలన్నీ పేజీలను సాయిబాబా కథనాలతో నింపేస్తున్నాయి. కడపలో ఎన్నికల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇప్పుడిలా సాయిబాబా మన పత్రికలకు ఉపయోగపడ్డారు. దాదాపు పద్దెనిమిదేళ్ల కిందట ఇదే సాయిబాబాపై హత్యాప్రయత్నం జరిగినప్పుడు ఆయన లుంగీ పైకెత్తి మేడమీది గదిలోకి పరిగెత్తినట్టు రాసిన ‘ఈనాడు’ ఇప్పుడు కేవలం ఆయన భక్తులకు చేరువవడానికి పేజీలకు పేజీలు కథనాలు వండివార్చుతోంది. సాయిబాబాపై కాకుండా చిల్లర బాబాలపై పదునైన మాటల తూటాలతో విరుచుకుపడే టీవీ నైన్ అకస్మాత్తుగా గత వారం రోజులుగా కాషాయరంగు ధరించింది. ఇలా వీలైనప్పుడల్లా మన మీడియా ఎంత దిగజారుడు తనానికైనా సిద్ధమని నిస్సిగ్గుగా ప్రకటించుకుంటుంది. ఒక స్టాండు అంటూ లేకుండా ఎటుపడితే అటు నాలుకను తిప్పే ఊసరవెల్లి వ్యవహారం పత్రిక స్వప్రయోజనాలు కాపాడడం వరకూ ఏమోగాని, సమాజం నిలబడడానికి గాని, స్వయంగా ఎదగడానికి గాని ఏమాత్రం ఉపయోగపడదు. Read the rest of this entry

మన ప్రపంచం-17

సాధారణం

వ్యాపారం

గత వారం రోజులుగా అన్ని దినపత్రికలను, టీవీ చానెళ్లను పూనకం పట్టినట్టుగా పట్టేసింది క్రికెట్. వరల్డ్ కప్ సెమీ ఫైనల్ కు భారత, పాకిస్తాన్ జట్టులు చేరాయో  లేదో దీనిని ఎలాగైనా వ్యాపార వస్తువుగా మార్చాలనుకుని మీడియా భావించింది. దీనికి పూర్తి వత్తాసు కార్పొరేట్ ప్రపంచం నుంఇ లభించింది. ప్రజల వినియోగదారీ మనస్తత్వంపైనే మనుగడ సాగిస్తున్న మన మార్కెట్ శక్తులకు మీడియా తోడైతే ఇక చెప్పేదేముంది. ఇదీ అదీ అని తేడాలేకుండా అన్ని పత్రికలు, టీవీ చానెళ్లు గత వారం రోజులుగా విజయవంతంగా క్రికెట్ ను అమ్ముకోగలిగాయి.  Read the rest of this entry

‘హక్కుల’ ఊపిరి హరిస్తారా?

సాధారణం

జనవరి 13.

భోగీ పండుగ.

చెడుకు ప్రతీకగా భావించి పెద్దపెద్ద కర్ర దుంగలను ఒకచోట పేర్చి భోగీమంట పెట్టి దేశమంతటా చలి కాచుకుంటారు. కానీ మహారాష్ట్రలో పూణెకు దగ్గరలో వున్న లోనోవాలా ప్రాంతంలో నివశిస్తున్న 39 ఏళ్ల సతీష్ శెట్టికి మాత్రమ్ జీవితం చీకటయింది ఆ తెల్లవారి జామునే. Read the rest of this entry

మీరెటువైపు?

సాధారణం

అది త్రేతాయుగం…

నూనూగు మీసాల నూతన యవ్వనంలో పడుచు అందాల రాముడు తన తోటి సావాసగాళ్లతో రవ్వంత తుళ్లింతతో ఆటపాటలలో లీనమైవుండగా, తమ రాజసౌధానికి వచ్చిన మునులకు వంగి ప్రణమిల్లి వారికి దారిచ్చి మరలా తన ఆటలో మునిగిపోయాడు. అలా వెళ్లిన మునులు ఇలా తననే రమ్మనేసరికి ఆశ్చర్యపోతూ బిడియపడుతూ తండ్రి దశరథరాజు కొలువులోకి అడుగుపెట్టాడు. వారు చెప్పిందంతా విని మ్రాన్పడిపోయాడు. Read the rest of this entry

ఒక సోంపేట – కొన్ని గుణపాఠాలు

సాధారణం

గత రెండు దశాబ్దాలుగా సర్దార్ సరోవర్ డ్యామ్ కు వ్యతిరేకంగా గిరిజనులను, ఆదివాసులను, రైతాంగాన్ని, పర్యావరణవాదులను, మానవహక్కుల పోరాటకారులను ఏకతాటిమీద నిలబెట్టి ఉద్యమ సారధ్యం చేస్తున్న మేధాపాట్కర్ శ్రీకాకుళం జిల్లా సోంపేట పోలీసుల కాల్పులలో హతులైన వారి కుటుంబాలను పరామర్శించడానికి వచ్చినపుడు యాదృచ్ఛికంగా ఆ రోజే చనిపోయిన వారికి ఆ కుటుంబీకులు పెద్ద కర్మ చేస్తున్నారు. ఎటువంటి రాజకీయ, అరాజకీయ దన్నులు లేకుండా ప్రజలే నడుపుకొంటున్న ఈ ఉద్యమాన్ని చూసి నివ్వెరపోయిన ఆమె Read the rest of this entry